05-10-2025 NORMAL NEWS 08:55 PM
swarnodayam.com
Telugu Daily News
05-10-2025 08:55 PM By Mandala Yadagiri

ఘనంగా నవభారతి విద్యాలయం పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం

ఘనంగా నవభారతి విద్యాలయం పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం
Oplus_16908288

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: హుజురాబాద్ లోనీ న్యూ కాకతీయ మోడల్ స్కూల్ ఆవరణంలో పూర్వపు నవ భారతి విద్యాలయంలో పదవ తరగతి (2008–09) బ్యాచ్ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఆదివారం ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా పూర్వ విద్యార్థులు పాఠశాల రోజుల మధుర స్మృతులను తలచుకుంటూ ఆనందభరితంగా గడిపారు.
పూర్వ ఉపాధ్యాయులు, విద్యార్థులు పరస్పరం అనుభవాలు పంచుకున్నారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ.. పూర్వ విద్యార్థుల సమ్మేళనం పాఠశాల గౌరవాన్ని మరింత పెంచిందని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు రమణరెడ్డి, అధ్యాపకులు నేపాల్, రమేష్, మధుకర్, సంపత్ , రవీందర్, భిక్షపతి, మధుకర్, రవీందర్, కుమార్, విజయ మరియు పూర్వ విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
సమ్మేళనం అనంతరం సాంస్కృతిక కార్యక్రమాలు, స్నేహ భోజనం నిర్వహించారు.

పూర్వపు నవ భారతి విద్యాలయంలో పదవ తరగతి (2008–09) బ్యాచ్ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం దృశ్యం.

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!