Social 1080×1350 • Multi-page
05-10-2025 BREAKING NEWS 09:41 PM
swarnodayam.com
Telugu Daily News

కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మాజీ కేంద్ర మంత్రి కీ.శే శ్రీ గడ్డం వెంకటస్వామి(కాక )96వ జయంతి వేడుకలు..

కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మాజీ కేంద్ర మంత్రి కీ.శే శ్రీ గడ్డం వెంకటస్వామి(కాక )96వ జయంతి వేడుకలు..
Oplus_16908288

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: అనుక్షణం పేదల కోసమే శ్రమించి పల్లె బస్ పల్లెల్లో ఉన్నటువంటి బస్తీలలో గుడిసెలు నిర్మించాలని అటువంటి తలంపుతో పేదల కోసం కొట్లాడే గుడిసెలు నిర్మించిన మన కాక వెంకటస్వామి తన ఇంటి పేరునే మార్చుకొని గుడిసెల వెంకటస్వామిగా పేరు తెచ్చుకున్నటువంటి మహానేత ఈరోజు 96 వ జయంతి సందర్భంగా హుజూరాబాద్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ఒడితెల ప్రణవ్ గారి ఆదేశాల మేరకు ఈరోజు హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ కాక జీవితమంతా తెలంగాణ ప్రజల కోసం తెలంగాణ బడుగు బలహీన వర్గాల కోసం సింగరేణి కార్మికుల కోసం కార్మిక శక్తిగా అవతరించి ఆనాటి గవర్నమెంట్ లో కేంద్ర కార్మిక శాఖ ఇస్తే భారత కార్మిక లోకానికి ఆదర్శంగా ఇచ్చినటువంటి వ్యక్తిగా మన వెంకటస్వామి నిలిచారని పలువురు కొనియాడారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికార ప్రతినిధి సొల్లు బాబు పట్టణ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు యేముల పుష్పలత, మండల అధ్యక్షురాలు పుల్ల రాధ సీనియర్ కాంగ్రెస్ నాయకులు సొల్లు దశరథం, బ్లాక్ అధ్యక్షురాలు ఆలేటి సుశీల ,సీనియర్ కాంగ్రెస్ నాయకులు తాళ్లపల్లి రమేష్ గౌడ్, తౌసిఫ్ నర్సింగ్,,సొల్లు సునీత, రిబ్క, మొలుగు రాధ, మధుకర్,రియాజ్ ,కల్పన తదితర కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొని వారి చిత్ర పటానికి పూల మాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది..

కాక చిత్రపటానికి పూలమాల వేసే నివాళులర్పిస్తున్న కాంగ్రెస్ నాయకులు…

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!