06-10-2025 NORMAL NEWS 03:30 PM
swarnodayam.com
Telugu Daily News
06-10-2025 03:30 PM By Mandala Yadagiri

ఎల్ఐసి ఏజెంట్ల సంక్షేమానికి కృషి..- లియాఫీ హుజురాబాద్ అధ్యక్షుడు మోకిరాల సంపత్ రావు.. – లియాఫీ నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం

ఎల్ఐసి ఏజెంట్ల సంక్షేమానికి కృషి..- లియాఫీ హుజురాబాద్ అధ్యక్షుడు మోకిరాల సంపత్ రావు.. – లియాఫీ నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం
IMG-20251006-WA0051

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్:
ఎల్ఐసి ఏజెంట్లు సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని లియాసి హుజురాబాద్ అధ్యక్షుడు మోకిరాల సంపత్ రావు అన్నారు. సోమవారం హుజరాబాద్ పట్టణంలోని దర్శిని ఫంక్షన్ హాల్ లో లియాఫీ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం జరిగింది. ఇటీవల జరిగిన ఎల్ఐసి ఏజెంట్లు ఎన్నికల్లో గెలుపొందిన నాయకులందరూ సోమవారం ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా సంపత్ రావు మాట్లాడుతూ… ఎల్ఐసి ఏజెంట్ల సంక్షేమానికి లియాఫీ ఎంతగానో కృషి చేస్తుందన్నారు. అదేవిధంగా లియాఫీ పోరాట ఫలితంగానే ఇటీవల కేంద్ర ప్రభుత్వం పాలసీలపై జీఎస్టీ రద్దు చేసిందని గుర్తు చేశారు. ఎల్ఐసి ఏజెంట్లు ఎదుర్కొంటున్న సమస్యలపై ఎప్పటికప్పుడు లియాఫీ పోరాటం చేస్తున్నదన్నారు. ఏజెంట్లు ప్రతి ఒక్కరు ఐక్యంగా ఉండి ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. అనంతరం ఏజెంట్ల సమస్యల పై పోరాటం చేస్తామని ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి మునగాల సమ్మారావు, కోశాధికారి గంట సంపత్, మీడియా ఆర్గనైజర్లుగా కుడుతాడి బాపురావు, చిలుకమారి సత్యరాజ్, పంజాల తిరుపతి, బత్తుల రాజలింగం, ఉపాధ్యక్షులుగా, జాయింట్ సెక్రెటరీలుగా, ఆర్గనైజింగ్ సెక్రటరీగా, అడ్వైజర్లుగా, మహిళా విభాగం ఆర్గనైజర్ లుగా మాటికె స్వప్న, ఆకుల లలిత, ఇంద్రాదేవి, మల్లీశ్వరి, స్వరూప, మంజుల, శ్రీలత తదితరులు పాల్గొన్నారు.

లియాపి అధ్యక్షులుగా మొకిరాల సంపత్ రావు, ప్రధాన కార్యదర్శిగా మునిగాల సమ్మారావు, కోశాధికారిగా గంట సంపత్ తదితరులు ప్రమాణ స్వీకారం చేస్తున్న దృశ్యం.

ప్రమాణ స్వీకారం చేస్తున్న మీడియా సెల్ నాయకులు..

ప్రమాణ స్వీకార చేస్తున్న మహిళా విభాగం నాయకురాలు…

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!