06-10-2025 NORMAL NEWS 08:14 PM
swarnodayam.com
Telugu Daily News
06-10-2025 08:14 PM By Mandala Yadagiri

ఎన్నికల నిబంధనల ప్రకారం నడుచుకోవాలి.. – హుజురాబాద్ ఎన్నికల సహాయ అధికారి, ఎంపీడీవో తూర్పాటి సునీత

ఎన్నికల నిబంధనల ప్రకారం నడుచుకోవాలి.. – హుజురాబాద్ ఎన్నికల సహాయ అధికారి, ఎంపీడీవో తూర్పాటి సునీత
Oplus_16908288

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతి అధికారి ఎన్నికల సంఘం రూపొందించిన నియమ నిబంధనల ప్రకారం నడుచుకోవాలని హుజురాబాద్ ఎన్నికల సహాయ అధికారి, ఎంపీడీవో తూర్పాటి సునీత అన్నారు . సోమవారం పంచాయతీ రాజ్ ఎన్నికలలో భాగంగా హుజురాబాద్ పట్టణ శివారులోని కేసీ క్యాంపులో గల రైతు వేదికలో హుజురాబాద్ మండలంలో పనిచేయుచున్న ఉపాధ్యాయులకు, ఉద్యోగులకు, ప్రెసిండింగ్ అధికారులకు ఎన్నికల శిక్షణ కార్యక్రమము జరిగింది. ఈ సందర్భంగా టిఓటి టి.మాధవరావు మాట్లాడుతూ…ఎన్నికల సమయంలో ఎన్నికల విధులు నిర్వహించే వారు ఎవరైనా నిబంధనలో ప్రకారమే పని చేయాలనీ అన్నారు. ఎన్నికల అధికారుల విధులు బాధ్యతల గురించి వివరించారు. ఈ శిక్షణ కార్యక్రమంలో మండల పంచాయతీ అధికారి కిరణ్, సూపరింటెండెంట్ వేణుగోపాల్, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.

ఎన్నికల సిబ్బందికి శిక్షణ ఇస్తున్న టిఓటి టి.మాధవరావు

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!