Social 1080×1350 • Multi-page
07-10-2025 BREAKING NEWS 01:04 PM
swarnodayam.com
Telugu Daily News

కూచిపూడి నాట్య కళాకారిణి పంజాల హాసిని ‘ వింద్రాణి ‘ అవార్డు 2025కి ఎంపిక

కూచిపూడి నాట్య కళాకారిణి పంజాల హాసిని ‘ వింద్రాణి ‘ అవార్డు 2025కి ఎంపిక
IMG_20251007_130001

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: హనంకొండ గోపాలపూర్ కి చెందిన కూచిపూడి, నాట్యచారిని కుమారి పంజాల హాసిని లాస్య డాన్స్ ప్రై లి.. చెన్నైలో నిర్వహించే జాతీయ స్థాయి శాస్త్రీయ నృత్య కళాకారుల పోటీలో పాల్గొని ‘వింద్రాణి ‘అవార్డుకి ఎంపిక అయినట్లు అ సంస్థ నుండి ఆహ్వనం అందుకోనున్నది. ఈ కార్యక్రమంలో దేశ నలుముల నుండి అత్యంత అత్భుత ప్రతిభ కనపరిచిన పలువురికి ఈ నెల 19న వింద్రాణి అకార్డులను ఎగ్మోర్ చెన్నైలో ప్రధానం చేయ్యనున్నారని తెలిపారు. వరంగల్ నగరానికి చెందిన NCN కళాక్షేత్రం నాట్య గురువు కోంతం వెంకటేశ్వర్లు వద్ద నాట్యంలో శిక్షణ తీసుకుంటున్న పంజాల హాసిని ని తల్లిదండ్రులు, పలువురు ప్రముఖంలు మరియు నాట్య గురువు కోంతం వెంకటేశ్వర్లు, తోటి విద్యర్థులు అభినందించారు. అయితే క్రీ, శే. తుపాకుల మొగిలయ్య (రంగస్థల, సినీ కళాకారుని) ఆశీర్వాదాలతో వారి మనవరాలు హుజురాబాద్ స్వగ్రామానికి చెందినవారు. NCN కళాక్షేత్రం నాట్య గురువు కొంతం వెంకటేశ్వర్లు గురువు శిష్యురాలుగా కూచిపూడి నాట్య కళాకారిణి పంజాల హాసిని కళావైభవాన్ని దేశ విదేశాలలో వారి కళ నైపుణ్యాన్ని ప్రదర్శిస్తూ అందరి ఆదరాభిమానాలు పొందుతున్నటువంటి పంజాల హాసిని కి హుజురాబాద్ కళాకారుల అందరి తరుపున కళాభివందనాలు తెలియజేస్తూనామన్నారు. ఆ కళమ్మ తల్లి ఆశీర్వాదాలు కళాకారుల అండదండతో అత్యున్నత స్థాయికి ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు హుజురాబాద్ కు చెందిన పలువురు కళాకారుల పేర్కొన్నారు.

నాట్య ప్రదర్శనలిస్తున్న కూచిపూడి నాట్య కళాకారిణి పంజల హాసిని..

కూచిపూడి నాట్య కళాకారిణి పంజలా హాసిని..

కూచిపూడి నాట్య కళాకారిణి పంజలా హాసిని

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!