07-10-2025 NORMAL NEWS 06:33 PM
swarnodayam.com
Telugu Daily News
07-10-2025 06:33 PM By Mandala Yadagiri

ధ్యానంతో సంపూర్ణ ఆరోగ్యం – యోగా గురువు అనిల్ కుమార్

ధ్యానంతో సంపూర్ణ ఆరోగ్యం – యోగా గురువు అనిల్ కుమార్
Oplus_16908288

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్:
మానవుడు వివిధ కారణాలవల్ల తన ఆరోగ్యాన్ని నష్టపోతుంటాడని ధ్యానంతో సంపూర్ణ ఆరోగ్యం పొందవచ్చని పిరమిడ్ సంస్థ ధ్యాన గురువు సిహెచ్ అనిల్ కుమార్ అన్నారు. మంగళవారం హుజురాబాద్ పట్టణంలోని రాధాస్వామి సత్సంగ్ లో పౌర్ణమి సందర్భంగా ప్రత్యేక ధ్యాన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ….నేటి యాంత్రిక యుగంలో మనిషి వివిధ ఆలోచనలతో మనశ్శాంతి లేకుండా జీవనం కొనసాగిస్తున్నాడని అన్నారు. విపరీతమైన ఆలోచనల వల్ల మనశ్శాంతి లేక అనేక వ్యాధులకు లోనవుతున్నాడని అన్నారు. మనిషి తన ఆరోగ్యాన్ని సాధించుకోవడం కోసం ధ్యానం చేయాలని, శ్వాసపై ధ్యాస పెడితే సర్వరోగ నివారిణి అవుతుందన్నారు. ప్రస్తుతం ఉన్న ఉరుకుల పరుగుల జీవితాల్లో ప్రతి ఒక్కరూ తమ మానసిక ప్రశాంతత కోసం ధ్యానం పట్ల శ్రద్ధ వహించాలని తప్పనిసరిగా ప్రతిరోజు ధ్యానం చేయాలని అన్నారు. ధ్యానం చేయడం వల్ల మానసిక ప్రశాంతత లభించి శారీరక ఆరోగ్యము పెరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ధ్యాన సాధకులు తాళ్లపల్లి రమేష్, సదానందం, కేశెట్టి విజయ్, కే రాములు, జయవర్ధన్ తదితరులు పాల్గొన్నారు.

మాట్లాడుతున్న పిరమిడ్ సంస్థ ధ్యాన గురువు సిహెచ్ అనిల్ కుమార్

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!