Social 1080×1350 • Multi-page
07-10-2025 BREAKING NEWS 08:52 PM
swarnodayam.com
Telugu Daily News

దత్తాత్రేయశర్మ గొప్ప ఆధ్యాత్మిక వేత్త.. ఆయన అందించిన సేవలు ఈ ప్రాంత ప్రజలు ఎన్నటికీ మరవరు. – మాజీ ఎంపీ కెప్టెన్

దత్తాత్రేయశర్మ గొప్ప ఆధ్యాత్మిక వేత్త.. ఆయన అందించిన సేవలు ఈ ప్రాంత ప్రజలు ఎన్నటికీ మరవరు. – మాజీ ఎంపీ కెప్టెన్
IMG-20251007-WA0045

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్:
ఈ ప్రాంత ప్రజల్లో ఆధ్యాత్మిక భావాన్ని పెంపొందించి, వేదాలను పఠించిన దత్తాత్రేయ శర్మ గొప్ప ఆధ్యాత్మికవేత్త అని, ఆయన హుజురాబాద్ ప్రాంతానికి అందించిన సేవలు ప్రజలు ఎన్నటికీ మరిచిపోరని మాజీ ఎంపీ కెప్టెన్ బి లక్ష్మీ కాంతారావు అన్నారు. మంగళవారం హుజురాబాద్ పట్టణంలో ఇటీవల చెందిన ప్రముఖ వేదపండితులు, పురోహితులు బ్రహ్మశ్రీ అవధానుల దత్తాత్రేయ శర్మ కుటుంబాన్ని(కుమారుడు భాస్కర్ శర్మను) ఆయన సందర్శించి పరామర్శించారు. ఆయన మృతి హుజురాబాద్ ఆధ్యాత్మిక లోకానికి ఎంతో తీరని లోటని అన్నారు. ఆయన మృతి పట్ల తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఆయనతో తనకు గల అనుబంధాన్ని ఆయన కుమారుడు భాస్కర్ శర్మతో పంచుకున్నారు. ఈ కార్యక్రమంలో కెప్టెన్ వెంట జిల్లా పరిషత్ మాజీ వైస్ చైర్మన్ పేరాల గోపాలరావు, వావిలాల ఖాదీ బోర్డు సభ్యుడు కట్టంగూరి రామచంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

దత్తాత్రేయ కుమారుడు భాస్కర్ శర్మను పరామర్శించి వివరాలు అడిగి తెలుసుకుంటున్న మాజీ ఎంపీ కెప్టెన్ లక్ష్మీకాంతరావు..

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!