Social 1080×1350 • Multi-page
07-10-2025 BREAKING NEWS 09:22 PM
swarnodayam.com
Telugu Daily News

ముదిరాజ్ రాష్ట్ర నాయకత్వం ఆదేశిస్తే జెడ్పిటిసిగా పోటీ చేస్తా.. – కాంగ్రెస్ జిల్లా ఫిషర్మెన్ చైర్మన్ బండి మల్లేష్

ముదిరాజ్ రాష్ట్ర నాయకత్వం ఆదేశిస్తే జెడ్పిటిసిగా పోటీ చేస్తా.. – కాంగ్రెస్ జిల్లా ఫిషర్మెన్ చైర్మన్ బండి మల్లేష్
IMG-20251007-WA0047

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి కరీంనగర్, (ఇల్లందకుంట)అక్టోబర్ 7: ముదిరాజ్ రాష్ట్ర నాయకత్వం ఆదేశిస్తే ఇల్లందకుంట జెడ్పిటిసిగా పోటీ చేస్తానని కాంగ్రెస్ జిల్లా ఫిషర్మెన్ చైర్మన్ బండి మల్లేష్ అన్నారు. ఈ సందర్భంగా బండి మల్లేష్ మంగళవారం మీడియాతో మాట్లాడుతూ గత పది సంవత్సరాల నుండి ముదిరాజ్ లు ఎదుర్కొంటున్న సమస్యలపై కాంగ్రెస్ పార్టీ పక్షాన పోరాటం చేస్తూ ఉన్నానని, గతంలో అధికారంలో ఉన్న బిఆర్ఎస్ పార్టీ ఎంత ఇబ్బందులకు గురిచేసిన కానీ పార్టీ కండువా మార్చకుండా మొదటి నుండి కాంగ్రెస్ పార్టీని మండలంలో బలోపేతం చేయడంలో నా వంతు కృషి చేశానని, మండలంలోని అన్ని గ్రామాల ముదిరాజ్ లను ఏకం చేసి అన్ని మండల కమిటీలు, గ్రామ కమిటీలను వేసి పార్టీ పటిష్టతకు కృషి చేస్తున్నానని ఆయన తెలిపారు. మండల కేంద్రంలోని అన్ని గ్రామాల్లో కాంగ్రెస్ ఫిషర్మెన్ కమిటీలను గడిచిన రెండు సంవత్సరాల కాలంలో గ్రామస్థాయిలో తీసుకెళ్లి ఫిషర్ మెన్ కమిటీలను బలోపేతం చేశానని రాష్ట్ర నాయకత్వం జడ్పిటిసి అభ్యర్థిగా పోటీ చేయాలని అవకాశం కల్పిస్తే పోటీ చేసి అధిక మెజార్టీతో గెలిచి రాష్ట్ర కమిటీకి బహుమతిగా అందిస్తానని ఆయన తెలిపారు.

కాంగ్రెస్ జిల్లా ఫిషర్మెన్ చైర్మన్ బండి మల్లేష్..

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!