Social 1080×1350 • Multi-page
10-10-2025 BREAKING NEWS 07:36 PM
swarnodayam.com
Telugu Daily News

వేతనాల కోసం ఉద్యోగుల వినూత్న నిరసన

వేతనాల కోసం ఉద్యోగుల వినూత్న నిరసన
IMG-20251010-WA0031

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: తమ వేతనాలు చెల్లించడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడం పట్ల నిరసిస్తూ హుజురాబాద్ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి లో పనిచేసే వైద్య విధాన పరిషత్ ఉద్యోగులు శుక్రవారం ఆసుపత్రి ముందు మౌన ప్రదర్శన చేసి వినూత్నంగా నిరసన తెలిపారు. వేతనాలు సక్రమంగా అందక పోవడంతో తమ ఆవేదనను ప్రభుత్వం అర్థం చేసుకోవాలనీ తెలంగాణ మెడికల్ ఎంప్లాయిస్ యూనియన్ ఆధ్వర్యంలో ఉద్యోగులు ప్లకార్డులు చేత పట్టుకొని నిశ్శబ్దంగా నిరసన తెలిపారు. ప్రభుత్వ వైఖరి వల్ల తాము తమ కుటుంబ సభ్యులు తీవ్ర ఇబ్బందులు గురవుతున్నారని అన్నారు వేతనాలు ఆలస్యం వల్ల కష్టాలు పడుతున్నామని వెంటనే పరిష్కరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో టిజిఎo ఈయు రాష్ట్ర ఉపాధ్యక్షురాలు స్వాతి పలువురు ఉద్యోగులు పాల్గొన్నారు.

వినూత్నముగ నిరసన వ్యక్తం చేస్తున్న ఉద్యోగులు..

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!