Social 1080×1350 • Multi-page
10-10-2025 BREAKING NEWS 11:43 PM
swarnodayam.com
Telugu Daily News

పోతిరెడ్డిపేట పోచమ్మ దేవాలయ అభివృద్ధికి పలువురు విరాళాలు

పోతిరెడ్డిపేట పోచమ్మ దేవాలయ అభివృద్ధికి పలువురు విరాళాలు
IMG-20251010-WA0040

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి, హుజురాబాద్:
హుజురాబాద్ మండలం పోతిరెడ్డిపేట గ్రామంలోని పోచమ్మ దేవాలయ అభివృద్ధికి శుక్రవారం పలువురు విరాళం అందజేసినట్లు గ్రామ మాజీ సర్పంచ్ తాటికొండ పుల్లాచారి తెలిపారు. మంకమ్మపల్లి గ్రామానికి చెందిన బాలసాని తేజశ్రీ , రజినీకాంత్ దంపతులు 50,016 రూపాయలు, హుజురాబాద్ మండలం పెద్దపాపయ్యపల్లికి చెందిన జాహ్నవి గ్యాస్ ఏజెన్సీ అధినేత సంగెo రాజేందర్ -శృతి దంపతులు 10,016 రూపాయలు దేవాలయ అభివృద్ధి కోసం దేవాలయ కమిటీకి విరాళంగా అందించారని ఆయన తెలిపారు. ఎంతో మహిమగల పోచమ్మతల్లి దేవాలయ అభివృద్ధి కోసం విరాళాలు అందించిన దాతలకు పోచమ్మ దీవెనలు ఉంటాయని పుల్లాచారి పేర్కొన్నారు.

దేవాలయ అభివృద్ధికి విరాళాలు ఇస్తున్న దాతలు…

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!