Social 1080×1350 • Multi-page
13-10-2025 BREAKING NEWS 09:24 PM
swarnodayam.com
Telugu Daily News

రెండు ద్విచక్ర వాహనాలు ఢీ ఒకరి మృతి..- మరొకరికి గాయాలు.

రెండు ద్విచక్ర వాహనాలు ఢీ ఒకరి మృతి..- మరొకరికి  గాయాలు.
IMG_20251013_212037

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ మండలం పోతిరెడ్డిపేట సబ్ స్టేషన్ సమీపంలో సోమవారం రాత్రి రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. రెండు బైకులు ఎదురు ఎదురుగా వెళ్లి ఢీ కొట్టడంతో తీవ్ర గాయాలతో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా మరొకరికి గాయాలు అయ్యాయి. మృతుడు పోతిరెడ్డిపేట గ్రామానికి చెందిన చింత సమ్మయ్య గౌడ్(46) గా స్థానికులు గుర్తించారు. గీత కార్మికునిగా జీవనం సాగించే సమ్మయ్య గౌడ్ కు భార్య ముగ్గురు పిల్లలు ఉన్నట్లు తెలిసింది. రోడ్డు ప్రమాదానికి కారణమైన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకొని స్టేషన్కు తరలించారు. అయితే ఈ రోడ్డు ప్రమాదానికి గల కారణాలు పూర్తిగా తెలియాల్సి ఉంది.

Oplus_16908288

రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన చింత సమ్మయ్య..

మృతిచెందిన చింత సమ్మయ్య (ఫైల్)

రోడ్డు ప్రమాదం కారమైన వ్యక్తిని అదుపులోకి తీసుకున్న పోలీసులు..

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!