Social 1080×1350 • Multi-page
14-10-2025 BREAKING NEWS 09:35 PM
swarnodayam.com
Telugu Daily News

హుజురాబాద్‌ ఆర్డిఓ నివేదిక జాప్యంపై ..బాధితుడి ఫిర్యాదు

హుజురాబాద్‌ ఆర్డిఓ నివేదిక జాప్యంపై ..బాధితుడి ఫిర్యాదు
IMG-20251014-WA0072

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి కరీంనగర్ అక్టోబర్ 14: 135 రోజుల తర్వాత కూడా తన ఫిర్యాదుపై తుది నివేదిక ఇవ్వకపోవడంతో బాధితుడు ఆవేదన వ్యక్తం చేశారు. 2024 డిసెంబర్ 23న ప్రజావాణి కార్యక్రమంలో ఫేక్ సర్టిఫికెట్‌తో జాబ్ చేస్తున్నాడన్న నేపథ్యంలో వీఆర్ఏ పై ఫిర్యాదు చేసిన బాధితుడికి, కలెక్టర్‌ 2025 ఏప్రిల్ 25న హుజురాబాద్‌ ఆర్ డి ఓను 15 రోజులలో నివేదిక సమర్పించాలని ఆదేశించారు. ఆర్ డిఓ మూడు సార్లు నోటీసులు జారీ చేసి, సెప్టెంబర్ 12, 2025న అంతిమ విచారణ పూర్తి చేసినప్పటికీ, తుది నివేదిక ఇంకా సమర్పించక పోవడం బాధితుడినీ ఆవేదనకు గురిచేసింది. ఇప్పటికే 33 రోజులు గడిచిన నేపథ్యంలో, సదరు ఆర్ డిఓ పై సోమవారం మరోసారి ప్రజావాణి ద్వారా ఫిర్యాదు చేశారు.

ఆర్డీవో పై కలెక్టర్ కు ఫిర్యాదు చేస్తున్న బాధితుడు..

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!