Social 1080×1350 • Multi-page
15-10-2025 BREAKING NEWS 08:11 PM
swarnodayam.com
Telugu Daily News

సిపిఆర్ తో ప్రాణ రక్షణ – డిప్యూటీ డిఎంఅండ్ హెచ్ఓ డాక్టర్ చందు

సిపిఆర్ తో ప్రాణ రక్షణ – డిప్యూటీ డిఎంఅండ్ హెచ్ఓ డాక్టర్ చందు
IMG-20251015-WA0111

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్:
వివిధ కారణాలవల్ల ఎవరైనా అపస్మారక స్థితిలో ఉన్నప్పుడు సిపిఆర్ ప్రక్రియ ద్వారా వారి ప్రాణాన్ని కాపాడవచ్చని, సిపిఆర్ తో ప్రాణ రక్షణ కలుగుతుందని హుజురాబాద్ డిప్యూటీ డిఎం అండ్ హెచ్ ఓ డాక్టర్ చందు అన్నారు. బుధవారం హుజూరాబాద్ పట్టణంలోని కాకతీయ జూనియర్ కళాశాలలో విద్యార్థిని విద్యార్థులకు సిపిఆర్ ప్రక్రియ గురించి వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…సిపిఆర్ ప్రక్రియ ఎమర్జెన్సీ టైంలో ప్రాణాన్ని కాపాడే ఒక అద్భుత ప్రక్రియ అని అన్నారు. ఈ మధ్యకాలంలో వివిధ కారణాలవల్ల ప్రతి ఒక్కరికి గుండె సమస్యలు వస్తున్నాయని, ప్రతి ఒక్కరు బిపి షుగర్ల బారిన పడకుండా జాగ్రత్తగా ఉండాలని అన్నారు. సింగపూర్ కిట్స్ ఇంజనీరింగ్ కళాశాల, చెల్పూర్ జెడ్ పిహెచ్ ఎస్ పాఠశాల విద్యార్థులకు సైతం సిపిఆర్ పై శిక్షణ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా శిక్షకులు డాక్టర్ వరుణ, డాక్టర్ తులసీదాస్, డాక్టర్ మధుకర్ ఆరోగ్య బోధకులు పంజాల ప్రతాప్ గౌడ్, కాకతీయ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ వేణుమాధవ్ తదితరులు పాల్గొన్నారు.

సిపిఆర్ పై అవగాహన కల్పిస్తున్న జిల్లా హెల్త్ ఎడ్యుకేటర్ పంజాల ప్రతాప్..

Oplus_16908288

సింగపూర్ కిట్స్ కళాశాలలో మాట్లాడుతున్న డిప్యూటీ డిఎం అండ్ హెచ్ ఓ డాక్టర్ చందు

Oplus_16908288

కాకతీయ కళాశాలలో మాట్లాడుతున్న చందు..

Oplus_16908288
Oplus_16908288
Oplus_16908288
చెల్పూర్ జెడ్ పిహెచ్ ఎస్ పాఠశాల విద్యార్థులకు సిపిఆర్ పై శిక్షణ ఇస్తున్న వైద్యులు..

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!