Social 1080×1350 • Multi-page
15-10-2025 BREAKING NEWS 08:40 PM
swarnodayam.com
Telugu Daily News

తెలుగు యూనివర్సిటీ సాహితీ పురస్కారానికి ఎంపికైన నంది అవార్డు గ్రహీత రావుల పుల్లాచారి.

తెలుగు యూనివర్సిటీ సాహితీ పురస్కారానికి ఎంపికైన నంది అవార్డు గ్రహీత రావుల పుల్లాచారి.
Oplus_16908288

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయం 2023 సంవత్సరానికి గాను సాహిత్య విభాగంలో ప్రకటించిన అవార్డుకు హుజురాబాద్ పట్టణానికి చెందిన కవి, రచయిత, డబుల్ నంది అవార్డు గ్రహీత రావుల పుల్లాచారి సాహితీ పురస్కారానికి ఎంపికయ్యారు. తెలుగు విశ్వవిద్యాలయం సాహిత్య విభాగంలో పద్య గేయ నాటక కథానిక పుస్తక కథానిక తదితర అంశాలలో ఉత్తమ రచనలకు అవార్డులు అందజేస్తారు. ఈ నేపథ్యంలో 2023 సంవత్సరానికి గాను నాటక ప్రక్రియలో రావుల పుల్లాచారి రచించిన రచ్చబండ కు సాహితీ పురస్కారాలు లభించింది. పుల్లాచారికి సాహితీ పురస్కారం లభించడం పట్ల హుజురాబాద్ ప్రాంతానికి చెందిన కవులు, కళాకారులు, సాహితీ అభిమానులు హర్షం వ్యక్తం చేసి, అభినందనలు తెలిపారు.

తెలుగు యూనివర్సిటీ సాహితీ పురస్కారానికి ఎంపికైన నంది అవార్డు గ్రహీత, కవి, రచయిత రావుల పుల్లాచారి.

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!