Social 1080×1350 • Multi-page
16-10-2025 BREAKING NEWS 04:21 PM
swarnodayam.com
Telugu Daily News

ప్రమాదవశాత్తు ట్రాక్టర్ బోల్తా.. డ్రైవర్ దుర్మరణం.

ప్రమాదవశాత్తు ట్రాక్టర్ బోల్తా.. డ్రైవర్ దుర్మరణం.
IMG_20251016_161600

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: కరీంనగర్ జిల్లా హుజురాబాద్ మండలం రాంపూర్ గ్రామ శివారులో ట్రాక్టర్ బోల్తా పడి డ్రైవర్ మృతి చెందిన సంఘటన గురువారం చోటు చేసుకుంది. స్థానికులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. హుజురాబాద్ మండలం రంగాపూర్ గ్రామానికి  చెందిన తునికి యోబు(20) పెద్దపాపయ్యపల్లికి ట్రాక్టర్ తో ఇసుక తీసుకువెళ్లి అన్ లోడ్ చేసి ఇంటికి ట్రాక్టర్ నడుపుకుంటూ వస్తుండగా, హనుమకొండ -కరీంనగర్ బైపాస్ రోడ్డుపై రాంపూర్ గ్రామ శివారులో ట్రాక్టర్ అదుపుతప్పి బోల్తా పడింది. ప్రమాదవశాత్తు అదే ట్రాక్టర్ కింద డ్రైవర్ యేబు పడడంతో తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతి  చెందాడు. సంఘటనను గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వగా సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు  ట్రాక్టర్ కింద ఇరుక్కుపోయిన యోబు మృతదేహాన్ని స్థానికుల సహాయంతో పోలీసులు బయటకు తీసి పోస్టుమార్టం నిమిత్తం హుజురాబాద్ లోని ఏరియా ఆసుపత్రికి తరలించారు. మృతుని కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసునమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. అయితే అక్రమ ఇసుక తరలింపు యువకుడి ప్రాణానికి కారణమైందని స్థానికులు ఆరోపించారు. ఇటీవల ఏసిపి మాధవి అక్రమ ఇసుక పై ఉక్కు పాదం మోపుతుండడంతో ప్రధాన రహదారిని కాదని నిర్మాణ దశలో ఉన్న హన్మకొండ- కరీంనగర్ బైపాస్ రోడ్డు గుండా ఇసుకను ఒట్టు చప్పుడు కాకుండా తరలించి వచ్చే క్రమంలోనే ఈ ప్రమాదం చోటుచేసుకుని యువకుడు మృత్యువాత పడడం గమనార్హం.

ట్రాక్టర్ కిందపడి మృతి చెందిన యేబు

ప్రమాదవశాత్తు ట్రాక్టర్ కింద పడి మృతి చెందిన (యేబు)

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!