Social 1080×1350 • Multi-page
17-10-2025 BREAKING NEWS 11:13 PM
swarnodayam.com
Telugu Daily News

చెల్పూర్ లో కంటి స్క్రీనింగ్ టెస్టులు.. – జయన్న ఫౌండేషన్ సేవలను అభినందించిన గ్రామస్తులు..

చెల్పూర్ లో కంటి స్క్రీనింగ్ టెస్టులు.. – జయన్న  ఫౌండేషన్ సేవలను అభినందించిన గ్రామస్తులు..
IMG-20251017-WA0110

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్ :
హుజురాబాద్ మండలం చెల్పూరు గ్రామంలో శుక్రవారం
జయన్న ఫౌండేషన్ ఆధ్వర్యంలో జయన్న ఫౌండేషన్ వ్యవస్థాపకులు గుడిపాటి జైపాల్ రెడ్డి, మాజీ ఎంపీటీసీ సభ్యురాలు గుడిపాటి సరితల ఆధ్వర్యంలో పలువురికి కంటి స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా వైద్య నిపుణులు ఇటీవల కంటి శస్త్ర చికిత్సలు జరుపుకున్న 250 మందికి స్క్రీనింగ్ టెస్ట్ ల నిర్వహించారు. శస్త్ర చికిత్స అనంతరం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఎలాంటి పనులు చేయకూడదు వారికి వివరించారు. మండలంలోని పలు గ్రామాలకు చెందిన 250 మంది తమ కంటి చూపు కోసం ఉచితంగా శస్త్ర చికిత్సలు జరిపించిన జయన్న ఫౌండేషన్ అధినేత జైపాల్ రెడ్డిని, మాజీ ఎంపీటీసీ సభ్యురాలు సరితలను అభినందించారు. తమ చూపు కోసం వారు చేస్తున్న కృషిని కొనియాడారు. తమకు చూపులు ఇవ్వడం కోసం జైపాల్ రెడ్డి సరితలు చేస్తున్న సేవలను ప్రశంసించి అభినందించారు.

వృద్ధులను అడిగి తెలుసుకుంటున్న జైపాల్ రెడ్డి.. సరిత..

కంటి చూపుకై శస్త్ర చికిత్స చేసుకున్న వారితో నిర్వాహకులు

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!