18-10-2025 NORMAL NEWS 05:44 PM
swarnodayam.com
Telugu Daily News
18-10-2025 05:44 PM By Mandala Yadagiri

హుజురాబాద్‌ ఇందిరానగర్ లో విషాదం.. ఉరివేసుకొని ఐటీఐ విద్యార్థి ఆత్మహత్య – ఇంద్ర నగర్ కాలనీలో అలుముకున్న విషాదఛాయలు.

హుజురాబాద్‌ ఇందిరానగర్ లో విషాదం.. ఉరివేసుకొని ఐటీఐ విద్యార్థి ఆత్మహత్య – ఇంద్ర నగర్ కాలనీలో అలుముకున్న విషాదఛాయలు.
IMG_20251018_174024

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి ​హుజురాబాద్‌ : కరీంనగర్ జిల్లా హుజురాబాద్ మున్సిపల్ పరిధిలోని ఇందిరానగర్ కాలనీలో ఐటిఐ చదువుతున్న ఓ యువకుడు ఇంట్లో ఫ్యాన్ కి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకోవడం గ్రామంలో తీవ్ర విషాదాన్ని నింపింది. పట్టణంలోని కొత్తపల్లి ఇంద్రనగర్ కాలనీకి చెందిన ఐటీఐ విద్యార్థి మోరే రిషి(20) తన కిరాయి ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.
వివరాలు ఇలా ఉన్నాయి. హుజురాబాద్ మండలం కొత్తపల్లి ఇంద్రనగర్ కాలనికి చెందిన మోరే నాగరాజు కుమారుడు మోరే రిషి జమ్మికుంటలోని గాయత్రి ఐటిఐ కళాశాలలో ఐటీఐ ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు. నిరుపేద మాదిగ కులానికి చెందిన ఈ యువకుడు, ఇటీవల కాలంలో ఏదో కారణం చేత తీవ్ర మనస్తాపానికి గురైనట్లుగా తెలుస్తోంది.
​ఈ క్రమంలో శనివారం సాయంత్రం రిషి తాను నివాసముంటున్న కిరాయి ఇంట్లో ఫ్యాన్‌కు తాడుతో ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ దారుణాన్ని గమనించిన కుటుంబ సభ్యులు, స్థానికులు వెంటనే అతడిని స్థానిక ఏరియా ఆసుపత్రికి తరలించారు. డాక్టర్లు అతడిని పరీక్షించిన అనంతరం రిషి అప్పటికే మృతి చెందినట్లుగా నిర్ధారించారు.
​ ఆత్మహత్యకు గల కారణాలేంటి!?
చిన్న వయసులోనే రిషి అనే యువకుడు ఆత్మహత్యకు పాల్పడటానికి గల కారణాలపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. రిషి తండ్రి నాగరాజు పక్షవాతంతో బాధపడుతుండగా ఇటీవల కాంగ్రెస్ ప్రభుత్వం మంజూరు చేసిన ఇందిరమ్మ ఇల్లు మంజూరు కావడంతో నూతనంగా ఇల్లు నిర్మించుకోవడం జరుగుతుంది. ఆయితే మానసిక ఒత్తిడ లేదా ప్రేమ వ్యవహారాలు అయి ఉంటాయా, ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. మృతుడి తండ్రి మోరే నాగరాజు అనారోగ్య రీత్యా పక్షవాతంతో (పెరాల్సిస్‌) బాధపడుతూ ఇంట్లోనే ఉంటున్నారు. చేతికొచ్చిన కొడుకు అకాల మరణంతో ఆ కుటుంబానికి తీరని లోటును మిగిల్చింది.
పోస్టుమార్టం నిమిత్తం తరలింపు: చికిత్స కోసం ఏరియా ఆసుపత్రికి తీసుకుపోయిన రీషి చనిపోవడంతో వెంటనే ఆక్కడి నుండి పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రిలోని మార్చురీకి తరలించారు. రిషి కుటుంబ సభ్యుల రోదనలు ఇంద్రనగర్ కాలనీలో హృదయవిదారకంగా మారాయి. ఈ ఘటనపై పోలీసులు మరింత లోతుగా విచారణ జరుపుతున్నారు. ఆ యువకుడు మరణానికి కారణాలపై పూర్తి వివరాలు పోలీసుల సమగ్ర విచారణ అనంతరం వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.

ఏరియా ఆసుపత్రికి తరలించగా పరీక్షించిన వైద్యులు..

మృతి చెందిన మోరే రిషి..

Oplus_16908288

కొడుకు మృతదేహంపై పడి రోదిస్తున్న తల్లి తీరు పలువురిని కలచివేసింది…

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!