Social 1080×1350 • Multi-page
18-10-2025 BREAKING NEWS 09:11 PM
swarnodayam.com
Telugu Daily News

బీసీ బంద్ సంపూర్ణం -అఖిలపక్షాల నాయకుల నిరసన

బీసీ బంద్ సంపూర్ణం -అఖిలపక్షాల నాయకుల నిరసన
IMG-20251018-WA0105

, మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్:
బిసిలకు 42 శాతం రిజర్వేషన్ల కల్పనల విషయంలో జరుగుతున్న అన్యాయాన్ని నిరసిస్తూ బీసీ జేఏసీ ఇచ్చిన బంద్ పిలుపుమేరకు శనివారం హుజురాబాద్ లో సంపూర్ణంగా జరిగింది. బిసి బంద్ ను పురస్కరించుకొని శనివారం తెల్లవారుజామునే అఖిలపక్ష నాయకులు హుజురాబాద్ బస్ డిపో గేటు వద్ద బస్సులు బయటికి రాకుండా ధర్నా నిర్వహించారు. బస్సులను బయటికి పంపరాదని వారు డిమాండ్ చేశారు. పట్టణంలో మోటార్ సైకిళ్ల పై బీసీ సంఘాల నాయకులు, బిఆర్ఎస్, కాంగ్రెస్, బిజెపి, ప్రజా సంఘాలకు చెందిన నాయకులు కార్యకర్తలు పట్టణంలోని అన్ని వీధులు తిరుగుతూ దుకాణాలను బందు చేయించారు. బీసీల ఐక్యత వర్ధిల్లాలి, 42 శాతం రిజర్వేషన్లను సాధిస్తామంటూ నినాదాలు చేశారు. పట్టణంలో వ్యాపార సంస్థలు పెట్రోల్ బంకులు సినిమా థియేటర్లు విద్యాసంస్థలు స్వచ్ఛందంగా బందు పాటించగా ప్రభుత్వ కార్యాలయాలు నామమాత్రంగా నడిచాయి ప్రభుత్వ పాఠశాలలు సైతం బందుకు సహకరించాయి. బంద్ సందర్భంగా టీజేఎస్, సిపిఐ, సిపిఎం నాయకులు అంబేద్కర్ విగ్రహం వద్ద రిజర్వేషన్లకు మద్దతుగా నినాదాలు చేశారు. బస్సులు రాకపోవడంతో ఆర్టీసీ బస్టాండ్ నిర్మానుష్యంగా మారింది. బస్ డిపోలో బస్సులన్నీ నిలిచిపోయాయి. ఆర్టీసీ కార్మికులంతా డిపోలోనే ఉండిపోయారు. బందు సంపూర్ణంగా జరగడంతో హుజురాబాద్ పట్టణంలోని వీధులన్నీ నిర్మానుష్యంగా మారాయి. బందు సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా ఉండేందుకు హుజురాబాద్ టౌన్ సిఐ టీ కరుణాకర్ ఎస్ఐలు యూనస్ అలీ, రాధాకృష్ణ లతోపాటు పోలీసులు బందోబస్తు నిర్వహించారు.

ఆర్టీసీ డిపో ఎదుట ధర్నా చేస్తున్న అఖిలపక్ష నాయకులు..

డిపో కే పరిమితమైన ఆర్టీసీ బస్సులు..

చౌరస్తాలో నిరసన వ్యక్తం చేస్తున్న బిజెపి నాయకులు…

కళాకారుల ఆటపాటలతో నిరసన వ్యక్తం చేస్తున్న అఖిలపక్ష, దళిత ప్రజా సంఘాల నాయకులు..

జమ్మికుంట రోడ్ లో ఓ హోటల్ నిర్వాహకుడు నడుపుతుండగా ఆందోళన కారులతో వాగ్వాదం జరుగుతున్న దృశ్యం..

చౌరస్తాలో నిరసన వ్యక్తం చేస్తున్న సిపిఎం నాయకులు..

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!