19-10-2025 NORMAL NEWS 06:22 PM
swarnodayam.com
Telugu Daily News
19-10-2025 06:22 PM By Mandala Yadagiri

ఈడబ్ల్యూఎస్ పై దుష్ప్రచారాన్ని ఆపాలి… – ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల అమలుకు ప్రత్యేక జాతీయ కమిషన్ ఏర్పాటు చేయాలి. -జనవరి నెలలో లక్షమందితో వరంగల్లో ఓసి సింహగర్జన సమరభేరి. – ఓసి సామాజిక సంక్షేమ సంఘాల సమాఖ్య జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు, రాష్ట్ర కన్వీనర్ గోప్ జైపాల్ రెడ్డి.

ఈడబ్ల్యూఎస్ పై దుష్ప్రచారాన్ని ఆపాలి… – ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల అమలుకు ప్రత్యేక జాతీయ కమిషన్ ఏర్పాటు చేయాలి. -జనవరి నెలలో లక్షమందితో వరంగల్లో ఓసి సింహగర్జన సమరభేరి. – ఓసి సామాజిక సంక్షేమ సంఘాల సమాఖ్య జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు, రాష్ట్ర కన్వీనర్ గోప్ జైపాల్ రెడ్డి.
IMG-20251019-WA0053

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హనుమకొండ:
ఏళ్ల తరబడి పోరాడి సాధించుకున్న రాజ్యాంగ బద్దంగా ఎర్బడ్డ ఈడబ్లూఎస్ రిజర్వేషన్లపై రాజకీయ పబ్బం కోసం కొన్ని దుష్ట శక్తులు అసత్యపు ప్రచారాలను చేస్తూ ఆయా కులాల్లోని ప్రజలను మభ్య పెడుతూ చేస్తున్న కుట్రలను సాగనివ్వబోమని సామాన్య ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఓసి సామాజిక సంక్షేమ సంఘాల సమాఖ్య జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు, రాష్ట్ర కన్వీనర్ గొప్ జైపాల్ రెడ్డిలు తీవ్ర స్థాయిలో హెచ్చరించారు.
అన్ని కులాలకు రాజ్యాంగ పరంగా రిజర్వేషన్లు ఇచ్చి ఏడున్నర దశాబ్దాలకు పైగా అమలు చేస్తున్నాయనీ, దీంతో స్వార్థ ఓటు బ్యాంకు రాజకీయ ఫలితంగా ప్రతిభగల ఓసిలకు విద్యా ఉద్యోగాల్లో 75 ఏళ్లుగా తీవ్రంగా నష్టం జరగడంతో, ఏళ్ల తరబడి ఓసి సంఘాల చేసిన అలుపెరుగని సుదీర్ఘ పోరాటాల ఫలితంగా రాజ్యాంగ సవరణ ద్వారా ఓసి పేదలకు కేంద్రం 10 శాతం ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లను కొన్నేళ్ల క్రితం కల్పించిందన్నారు. ఇట్టి రిజర్వేషన్ల పటిష్టంగా అమలుచేయుటకు చట్ట బద్దతగల జాతీయ ఈడబ్ల్యూఎస్ ప్రత్యేక కమిషన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.
ఆదివారం వరంగల్ లో ఓసి జెఎసి ఉమ్మడి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన వివిధ జిల్లాల రాష్ట్ర ప్రతినిధుల సభకు రాష్ట్ర కన్వీనర్ గోపి జయపాల్ రెడ్డి అధ్యక్షత వహించగా ముఖ్య అతిథిగా ఓసి సామాజిక సంక్షేమ సంఘాల సమాఖ్య జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు హాజరై మాట్లాడుతూ తాము ఏరాజకీయ పార్టీలకు ఏ కులాలకు ఏ మతాలకు వ్యతిరేకం కాదని అన్ని కులాల జనాభా దామాషా ప్రకారం ఆర్థిక స్థితి గతుల ఆధారంగా అన్ని వర్గాలకు సమన్యాయం జరగాలన్నదే తమ ఓసి సంఘాల సమాఖ్య ధ్యేయమన్నారు.
జనాభా దామాషా ప్రకారం ఓసిలకు అన్ని రంగాల్లో రిజర్వేషన్లు కల్పించాలని, ఈడబ్ల్యూఎస్ ఆధారంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సంక్షేమ పథకాలను ఓసి పేదలకు వర్తింప జేయాలని డిమాండ్ చేశారు. ఇదే డిమాండ్ తో డిసెంబర్ నెలలో లక్ష మంది ఓసి సామాజిక వర్గీయులతో సమ్మక్క సారలమ్మ, వీర ఝాన్సీ లక్ష్మీబాయిల పోరు గడ్డ వరంగల్ లో జనవరి నెలలో రాష్ట్ర స్థాయి ఓసిల సింహగర్జన సభను నిర్వహించి సమర భేరి మోగిస్తామని రామారావు, జైపాల్ రెడ్డిలు వెల్లడించారు. ఈ సమావేశానికి రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాల నుంచి రెడ్డి, వైశ్య, వెలమ, బ్రాహ్మణ, కమ్మ, మార్వాడి సంఘాల రాష్ట్ర, జిల్లాల నాయకులు పాల్గొన్నారు.
రాష్ట్ర బ్రాహ్మణ సంఘాల సమాఖ్య అధ్యక్షుడు గంగు ఉపేంద్రశర్మ, “రెడ్డి సంఘం తెలంగాణ” రాష్ర్టకన్వీనర్ బద్దూరి వెంకటేశ్వర్ రెడ్డి, ఉపాధ్యక్షుడు చందుపట్ల నర్సింహారెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నల్ల సంజీవరెడ్డి, వైశ్య సంఘాల నేతలు దుబ్బా శ్రీనివాస్, తోట సురేష్, వంగేటి అశోక్, మాధవ్ శంకర్, వెలమ సంఘం నేతలు నడిపెల్లి వెంకటేశ్వర్ రావు, బోయినపల్లి పాపారావు, కమ్మ సంఘం నేతలు రాయపాటి వెంకటేశ్వర్ రావు, సత్యనారాయణ కలాని, మర్వాది సంఘం నేతలు మందటి వేణుగోపాల్ రాష్ట్ర ఓసి జేఏసీ మహిళా అధ్యక్ష, కార్యదర్శి కంకణాల సరోజన, సంధ్యారాణి,
జేఏసీ రాష్ట్ర నాయకులు రావుల నరింహారెడ్డి, శశిధర్ రెడ్డి కామిడి సతీశ్ రెడ్డి, భూమ్ రెడ్డి, జైపాల్ రెడ్డి, చకిలం రాజేశ్వర్ రావు, చల్లా రాంరెడ్డి, శ్రీనివాసచారీ తదితరులు పాల్గొన్నారు.

జ్యోతి ప్రజ్వలన చేస్తున్న పోలాడి రామారావు..

ఉమ్మడి జిల్లా స్థాయి సదస్సులో మాట్లాడుతున్న పోలాడి రామారావు..
Oplus_16908288
Oplus_16908288

అభివాదం చేస్తున్న ఓసి జేఏసీ నాయకులు..

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!