Social 1080×1350 • Multi-page
22-10-2025 BREAKING NEWS 07:25 PM
swarnodayam.com
Telugu Daily News

వింద్రాణి అవార్డు అందుకున్న హాసిని

వింద్రాణి అవార్డు అందుకున్న హాసిని
IMG_20251022_192202

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: హనుమకొండ పట్టణంలోని గోపాలపూర్ కి చెందిన పంజాల మహేందర్ ఆమనీల కుమార్తె హాసిని వరంగల్ నగరానికి చెందిన NCN కళాక్షేత్రం నాట్య గురువు కోంతం వెంకటేశ్వర్లు వద్ద నాట్యంలో శిక్షణ తీసుకునీ కూచిపూడి, కథక్ నృత్యాకారిని కుమారి పంజాల హాసిని , లాస్య డాన్స్ ప్రై లి.. చెన్నైలో నిర్వహించిన జాతీయ స్థాయి శాస్త్రీయ నృత్య కళాకారుల అవార్డు కార్యక్రమంలో వింద్రాణి అవార్డు అందుకున్నారు. దేశ నలుముల నుండి వివిధ కళలలో అత్యంత అత్భుత ప్రతిభ కనపరుస్తున్న శాస్త్రీయ నృత్య కళాకారులను గుర్తించి ఈ అవార్డును అందచేశారు. ఈ మేరకు శనివారం రాత్రి ఎగ్మోర్ మ్యూజియం చెన్నైలో నల్లి సిల్క్స్ అధినేత పద్మశ్రీ నల్లి కుప్పుస్వామి మరియు లాస్య డాన్స్ ప్రై. లి. CEO మరియా రాజ్ చేతుల మీదుగా వింద్రాణి అవార్డును హాసిని అందుకున్నట్లు గురువు కొంతం వెంకటేశ్వర్లు తెలిపారు. కాగా ఈ సందర్భంగా
వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డిని మర్యాద పూర్వకంగా కలవడం జరిగింది. ఎమ్మెల్యే మాట్లాడుతూ కళలను కాపాడుకోవలసిన బాధ్యత అందరిమీద ఉందని యువత పాచ్యత పోకడలకు పోకుండా ఇలా మన సంస్కృతి సంప్రదాయం లో వెళ్లడం చాలా సంతోషకరమణి, శాల్వాతో సత్కరించి మరింత కృషితో మరిన్ని అవార్డులు తెచ్చుకొని రాష్ట్రానికి పేరు తేవాలని అభినందించారు. పంజాల హాసినిని తల్లిదండ్రులు, పలువురు ప్రముఖలు, తోటి విద్యార్థులు అభినందించారు. ఈ అవార్డు అందుకున్న హాసిని ఎవరో కాదు, హుజురాబాద్ పట్టణానికి చెందిన ప్రముఖ రంగస్థల, సిని కళాకారుడు తుపాకుల మొగిలయ్య మనమరాలు.

Oplus_16908288
వింద్రాణి అవార్డు అందుకుంటున్న హాసిని

————–++++++++—————–

&&లోకల్ యార్డ్స్&&

————–+++++++——————-

@@దీపావళి శుభాకాంక్షలు@@

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!