Social 1080×1350 • Multi-page
22-10-2025 BREAKING NEWS 08:58 PM
swarnodayam.com
Telugu Daily News

ఘనంగా స్వేరోస్ డే వేడుకలు

ఘనంగా స్వేరోస్ డే వేడుకలు
IMG-20251022-WA0156

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్:
హుజురాబాద్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద బుధవారం స్వేరోస్ డే వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి మిఠాయిలు పంచి పెట్టారు. అనంతరం . స్వేరోస్ జిల్లా అధికార ప్రతినిధి అకినపల్లి ప్రవీణ్ మాట్లాడుతూ….
అక్షరం , ఆరోగ్యం, ఆర్థికం,ఆత్మగౌరవం అనే నినాదాలతో స్వేరో మొదలైందని అన్నారు. పేద బిడ్డలకి ఉన్నత చదువులు ఇవ్వాలి అనే గొప్ప ఉద్దేశంతో ఎస్ఆర్ శంకరన్ స్థాపించిన గురుకులల్లో ఎంతోమంది ఉన్నత చదువులు చదువుతున్నారని అన్నారు. డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కృషితో మాలవత్ పూర్ణ, ఆనందులు ఎవరెస్ట్ శిఖరం ఎక్కగలిగారని అన్నారు. ఆర్ఎస్. ప్రవీణ్ కుమార్ వల్ల స్వెరోస్ అన్ని రంగాల్లో ముందుంటున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో గొర్రె చిరంజీవి, ఎర్ర రాజు, మేకల రవీందర్, వేల్పుల ప్రభాకర్, తునికి సమ్మయ్య, రామగిరి అంకూస్, నవీన్, స్వామి తదితరులు పాల్గొన్నారు.

ఎస్ ఆర్ శంకరన్ చిత్రపటానికి పూలమాల వేసే నివాళులర్పిస్తున్న స్వేరోస్..

—————-++++++++—————

&&లోకల్ యాడ్స్&&

————+++++++—————-

##దీపావళి శుభాకాంక్షలు&&

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!