Social 1080×1350 • Multi-page
22-10-2025 BREAKING NEWS 11:14 PM
swarnodayam.com
Telugu Daily News

కాల్పుల్లో గాయపడి చికిత్స పొందుతున్న సోను(ప్రశాంత్) ను పరామర్శించి, కుటుంబ సభ్యులకి ధైర్యం చెప్పిన ఎంపీ ఈటల రాజేందర్.

కాల్పుల్లో గాయపడి చికిత్స పొందుతున్న సోను(ప్రశాంత్) ను పరామర్శించి, కుటుంబ సభ్యులకి ధైర్యం చెప్పిన ఎంపీ ఈటల రాజేందర్.
IMG_20251022_230809

స్వర్ణోదయం ప్రతినిధి(మండల యాదగిరి), హైదరాబాద్: గోవులను తరలిస్తుండగా ఘట్కేసర్ వద్ద అడ్డుకోవడంతో ఎంఐఎం నాయకులు తుపాకీతో కాల్చడంతో తీవ్రంగా గాయపడి సికింద్రాబాద్ యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సోను (ప్రశాంత్) ను ఎంపీ ఈటల రాజేందర్ పరామర్శించి, కుటుంబ సభ్యులకి ధైర్యం చెప్పారు. అనంతరం ఈటల మీడియాతో మాట్లాడుతూ…

మన దేశంలో గోవును పూజిస్తారు.

ఆ గోమాతలను రక్షించుకోవడానికి సనాతన ధర్మాన్ని నమ్ముకున్న లక్షలాదిమంది భక్తులు గోరక్షకులు నిరంతరం ప్రయత్నం చేస్తారు అని ఈటెల పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత గోవులను తరలించే గుండాలను, మాఫియాను కాపాడుతున్నారనీ ఆరోపించారు. అనేకసార్లు ఈ గుండాలు ముఖ్యంగా ఎంఐఎం సంబంధించిన వారు గోరక్షకుల మీద దాడులు చేస్తున్నారు. వాహనాలతో గుద్ధి చంపే ప్రయత్నం చేశారు అన్నారు. గోరక్షకుల మీద అనేక హింసలు జరిగాయనీ, దానికి పరాకాష్ట ఓల్డ్ సిటీ నుంచి వచ్చిన ఇబ్రహీం అనే వ్యక్తి ప్రశాంత్ ను కాల్చి చంపే ప్రయత్నం చేశారు అంటే ఈ ప్రభుత్వం ఎటువైపు ఆలోచిస్తుందో అర్థం చేసుకోవాలన్నారు.

ఈ ఘటనకు సంపూర్ణ బాధ్యత రాష్ట్ర ప్రభుత్వమే వహించాలి.

ఈ ఘటనకు పాల్పడిన వారిని వెంటనే అరెస్టు చేసి చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలనీ ఎంపీ ఈటెల డిమాండ్ చేశారు. ఈ ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నానన్నారు. నిజామాబాదులో పోలీసులను చంపి ఛాలెంజ్ చేశారు, ఈరోజు భయం లేకుండా కాల్పులు జరిపి పోలీసుల్ని ఛాలెంజ్ చేశారు అని పేర్కొన్నారు. కోట్లాది మంది ప్రజల మనోభావాలు కాపాడాలంటే తక్షణమే స్పందించి అరెస్టు చేసి చట్టప్రకారం శిక్షించాలని ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాను అని ఈటెల రాజేందర్ పేర్కొన్నారు.

కాల్పుల్లో గాయపడి చికిత్స పొందుతున్న సోను(ప్రశాంత్)ను పరామర్శించి, కుటుంబ సభ్యులకి ధైర్యం చెప్పుతున్న ఎంపీ ఈటల రాజేందర్…

——————–++++++++—————

&&లోకల్ యాడ్స్&&

———————++++++—————–

##దీపావళి శుభాకాంక్షలు##

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!