Social 1080×1350 • Multi-page
23-10-2025 BREAKING NEWS 12:53 PM
swarnodayam.com
Telugu Daily News

తెలంగాణ రైజింగ్ – 2047 ” సిటిజన్ సర్వేలో అందరూ పాల్గొనాలి: – జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి పిలుపు.. – ఈనెల 25తో ముగియనున్న సర్వే

తెలంగాణ రైజింగ్ – 2047 ” సిటిజన్ సర్వేలో అందరూ పాల్గొనాలి: – జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి పిలుపు.. – ఈనెల 25తో ముగియనున్న సర్వే
FB_IMG_1761202958160

“మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి కరీంనగర్, అక్టోబర్ 21 : తెలంగాణా రాష్ట్ర భవిష్యత్ రూపకల్పనకై ఉద్దేశించిన “తెలంగాణ రైజింగ్ – 2047 ” సిటిజన్ సర్వే కు ప్రజల నుండి విశేష స్పందన లభిస్తోంది. ఇప్పటివరకు ఈ సిటిజన్ సర్వేలో కేవలం తెలంగాణ నుండే వివిధ ప్రాంతాల పౌరులు పాల్గొని తమ విలువైన సమాచారాన్ని అందచేశారు. భారత దేశ స్వాతంత్య్రానికి వంద సంవత్సరాలు పూర్తవుతున్న సందర్బంగా 2047 నాటికి తెలంగాణ రాష్ట్రం ఎలా ఉండాలో ప్రజల నుండి తగు సలహాలు, సూచనలు చేపట్టడానికి రాష్ట్ర ప్రభుత్వం “తెలంగాణ రైజింగ్ – 2047 ” సిటిజన్ సర్వేను చేపట్టింది. రాష్ట్ర ప్రభుత్వం గత వారం ప్రారంభించిన ఈ సర్వే ఈనెల 25 వతేదీతో ముగుస్తుంది. ఈ సర్వే రాష్ట్రంలోని ప్రతి ఒక్కరికీ అందుబాటులో ఉన్నందున www.telangana.gov.in /telanganarising అనే వెబ్సైట్ ను సందర్శించి ప్రతీ ఒక్కరు తమ అమూల్యమైన సలహాలు, సూచనలను అందించాల్సింగా జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి గురువారం ఒక ప్రకటనలో తెలియచేశారు.

జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!