Social 1080×1350 • Multi-page
23-10-2025 BREAKING NEWS 07:38 PM
swarnodayam.com
Telugu Daily News

మృతుల కుటుంబాలను పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే దాసరి, ఓసి జేఏసీ నేత పోలాడి.

మృతుల కుటుంబాలను పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే దాసరి, ఓసి జేఏసీ నేత పోలాడి.
IMG-20251023-WA0071

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి కరీంనగర్ (పెద్దపల్లి): పెద్దపల్లి జిల్లా ఎలిగేడ్ మండలంలోని సుల్తాన్ పూర్ గ్రామానికి చెందిన ఊర శ్రీనివాస్ రావు, ఆంజనేయుల మాతృ మూర్తులు ఇటీవలే ఇరువురు మృతి చెందగా వారి కుటుంబ సభ్యులను సుల్తాన్ పూర్ లోని వారి నివాసంలో గురువారం పెద్దపల్లి మాజీ శాసన సభ్యుడు దాసరి మనోహర్ రెడ్డి, ఎలిగేడు మాజీ ఎంపీపీ తానిపర్తి మోహన్ రావు, ఎలిగేడు మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు, పెద్దపల్లి జిల్లా ఓసి జెఎసి నేత బైరెడ్డి రాంరెడ్డిలతో కలిసి ఓసి జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు.
అనంతరం ఓసి జేఏసీ ఆధ్వర్యంలో జాతీయ ఈడబ్ల్యూఎస్ కమిషన్ ఏర్పాటు, ఓసిలకు జనాభా ప్రాతిపదికన అన్ని రంగాల్లో 20శాతం రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర స్థాయిలో వరంగల్ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ గ్రౌండ్ లో లక్షమంది తో నిర్వహించే రాష్ట్ర స్థాయి ఓసి సింహగర్జన సమరభేరి సన్నాహక ఏర్పాట్ల గురించి పెద్దపల్లి మాజీ శాసన సభ్యుడు దాసరి మనోహర్ రెడ్డికి నాయకులతో కలిసి పోలాడి రామారావు వివరించి మద్దతు కోరారు. రాజ్యాంగ బద్దంగా ఏర్పడ్డ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లపై తమ రాజకీయ పబ్బo కోసం అసత్య ప్రచారాలు, కుట్రలు చేస్తూ.. దుష్ప్రచారం చేస్తున్నారని వారి కుట్రలను సాగనువ్వబోమని, సామాన్య ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలాడి రామారావు పిలుపు నిచ్చారు. తాము ఏ పార్టీకి ఏ కులాల రిజర్వేషన్లకు వ్యతిరేకం కాదని అన్ని వర్గాల వారికి జనాభా దామాషా ప్రకారం అన్ని రంగాల్లో సామాజిక సమన్యాయం జరగాలన్నదే తమ ధ్యేయమని పోలాడి రామారావు మీడియాకు తెలిపారు.

ఊర శ్రీనివాస్ రావు, ఆంజనేయుల మాతృ మూర్తులు ఇటీవలే ఇరువురు మృతి చెందగా వారి కుటుంబ సభ్యులను పరామర్శిస్తున్న జాతీయ నాయకుడు పోలాడి రామారావు.

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!