Social 1080×1350 • Multi-page
24-10-2025 BREAKING NEWS 10:39 AM
swarnodayam.com
Telugu Daily News

ఘోర బస్సు ప్రమాద సంఘటనపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి

ఘోర బస్సు ప్రమాద సంఘటనపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి
IMG-20251024-WA0011

స్వర్ణోదయం ప్రతినిధి హైదరాబాద్: హైదరాబాద్ నుంచి బెంగుళూరు వెళుతున్న ప్రైవేటు ట్రావెల్స్ బస్సు కర్నూలు జిల్లా చిన్నటేకూరు వద్ద ఘోర ప్రమాదానికి గురైన సంఘటనపై ముఖ్యమంత్రి ఎ రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ అధికారులతో మాట్లాడి అవసరమైన సహాయ చర్యలు తీసుకోవాలని రాష్ట్ర అధికారులను ఆదేశించారు. ఈ ఘటనలో మరణించిన కుటుంబాలకు తీవ్ర సంతాపం తెలిపారు.

బస్సు ప్రమాద ఘటనపై ముఖ్యమంత్రి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీలతో మాట్లాడారు. సహాయక చర్యల కోసం హెల్ప్ లైన్ ఏర్పాటు చేయాలని చెప్పారు. వెంటనే ఘటనా స్థలానికి వెళ్లాలని గద్వాల్ కలెక్టర్, ఎస్పీలను ఆదేశించారు.

కర్నూలు జిల్లాలో బస్సు ప్రమాదం ఘటనలో కంట్రోల్‌ రూమ్‌లు ఏర్పాటు చేసిన ప్రభుత్వం.. కర్నూలు కలెక్టరేట్ లోని కంట్రోల్ రూమ్ నం. 08518-277305, కర్నూలు ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి కంట్రోల్ రూమ్ నం. 9121101059, ఘటనా స్థలి వద్ద కంట్రోల్ రూమ్ నం. 9121101061, కర్నూలు పోలీస్ ఆఫీసు కంట్రోల్ రూమ్ నం. 9121101075, కర్నూలు ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి హెల్ప్ డెస్క్ నంబర్లు: 9494609814, 9052951010 ఏర్పాటు చేయడం జరిగింది.

ముఖ్యమంత్రి ఎ రేవంత్ రెడ్డి

అగ్నిప్రమాదంలో పూర్తిగా దగ్ధమైన ప్రైవేట్ బస్సు..

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!