Social 1080×1350 • Multi-page
25-10-2025 BREAKING NEWS 04:06 PM
swarnodayam.com
Telugu Daily News

రిటైర్మెంట్ బెనిఫిట్స్ వెంటనే చెల్లించాలి.. – రిటైర్డ్ ఉద్యోగుల భారీ ర్యాలీ, నిరసన, వినతి.

రిటైర్మెంట్ బెనిఫిట్స్ వెంటనే చెల్లించాలి.. – రిటైర్డ్ ఉద్యోగుల భారీ ర్యాలీ, నిరసన, వినతి.
IMG-20251025-WA0047

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్ : రిటైర్మెంట్ అయిన ఉద్యోగులకు రావాల్సిన రిటైర్మెంట్ బెనిఫిట్స్ వెంటనే అందజేయాలని కోరుతూ తెలంగాణ రాష్ట్ర రిటైర్డ్ ఉద్యోగుల అసోసియేషన్ మండల శాఖ అధ్యక్షుడు మహమ్మద్ ఉస్మాన్ పాష ఆధ్వర్యంలో శనివారం తహశీల్దార్ కనుకయ్యకు వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా అసోసియేషన్ నాయకులు మాట్లాడుతూ ప్రభుత్వం వెంటనే స్పందించి పెండింగ్లో ఉన్న రిటైర్మెంట్ బెనిఫిట్స్ ను చెల్లించాలని డిమాండ్ చేశారు. చాలామంది ఉద్యోగులు పదవీ విరమణ పొంది చాలా కాలం అవుతున్నా వారికి రావాల్సిన గ్రాట్యుటీ, జనరల్ ప్రావిడెంట్ ఫండ్, గ్రూప్ ఇన్సూరెన్స్, కమ్యుటేషన్, సరెండర్ లీవులు వంటి ఆర్థిక ప్రయోజనాలు ఇంకా అందలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
పదవీ విరమణ తర్వాత ఈ ప్రయోజనాలపైనే వృద్ధాప్య జీవితం ఆధారపడి ఉంటుందని, ఆర్థిక ప్రయోజనాలు అందకపోవడం వల్ల అనారోగ్య సమస్యలకు చికిత్స చేయించుకోలేక, పిల్లల పెళ్లిళ్లు, ఇతర ముఖ్యమైన ఖర్చులకు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. పెండింగ్లో ఉన్న బకాయిలు ఒక్కోఉద్యోగికి లక్షల్లో ఉన్నాయని, ఈ నిధులు అందక అనేకమంది విశ్రాంత ఉద్యోగులు అప్పుల పాలవుతున్నారని పేర్కొన్నారు. ప్రభుత్వం ఆర్థిక ఇబ్బందుల పేరు చెప్పకుండా విశ్రాంత ఉద్యోగుల కష్టాలను గుర్తించి యుద్ధప్రాతిపదికన రిటైర్మెంట్ బెనిఫిట్స్ మొత్తం విడుదల చేయాలని తహశీల్దార్ కనుకయ్యకు ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాలని కోరారు. తక్షణమే పెండింగ్ బకాయిలను విడుదల చేసి విశ్రాంత ఉద్యోగులకు ఊరట కల్పించాలని తహశీల్దారు సమర్పించిన వినతిపత్రంలో కోరారు. ఈ కార్యక్రమంలో రిటైర్మెంట్ ఉద్యోగులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

పట్టణంలో నిరసన ర్యాలీ నిర్వహిస్తున్న రిటైర్డ్ ఉద్యోగులు..

తాసిల్దార్ కార్యాలయం దగ్గర నిరసన వ్యక్తం చేస్తున్న రిటైర్డ్ ఉద్యోగులు..

తాసిల్దార్ కనుకయ్యకు వినతి పత్రం అందజేస్తున్న రిటైర్డ్ దూల సంఘం నాయకులు..

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!