Social 1080×1350 • Multi-page
25-10-2025 BREAKING NEWS 04:41 PM
swarnodayam.com
Telugu Daily News

వంగర ఘటనపై సమగ్ర దర్యాప్తుకు ఆదేశించాం.. – కాంగ్రెస్ నేత ప్రణవ్..

వంగర ఘటనపై సమగ్ర దర్యాప్తుకు ఆదేశించాం.. – కాంగ్రెస్ నేత ప్రణవ్..
IMG_20251025_163910

– బాలిక మృతి పట్ల తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేసిన ప్రణవ్.

– బాలిక మృతదేహాన్ని అడ్డుపెట్టుకొని శవ రాజకీయాలు చేయడం సిగ్గుచేటు.. – ఓటు చోరీపై ఎలక్షన్ కమిషన్ కౌశిక్ రెడ్డి చంప చెళ్లుమనిపించింది.

– కౌశిక్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో మండిపడిన ప్రణవ్.

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం వంగర గ్రామంలో శుక్రవారం హుజురాబాద్ మండల పరిధిలోని రాంపూర్ గ్రామానికి చెందిన శ్రీ వర్షిత అనే బాలిక ఆత్మహత్య చేసుకోవడం చాలా బాధాకరమని, దీనిపై ఇప్పటికే రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ విచారణకు ఆదేశించారని, నిదేదిక రాగానే సంబంధిత వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకుంటామని హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జి వొడితల ప్రణవ్ తెలిపారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢసానుభూతి తెలియజేశారు. బాలిక మృతదేహాన్ని అడ్డుపెట్టుకొని కౌశిక్ రెడ్డి చేసిన ధర్నా చూస్తే సభ్య సమాజం తలదించుకునేలా ఉందని, పాప చనిపోయి పుట్టెడు దుఃఖంలో తల్లిదండ్రులు ఉంటే దీన్ని కౌశిక్ రెడ్డి అదునుగాతీసుకొని పోస్ట్ మార్టం అయిన తర్వాత బాలిక మృతదేహాన్ని అంబేద్కర్ చౌరస్తాలో పెట్టి ధర్నా చేయడం నీచమైన రాజకీయమని,అప్పుడు ఓట్ల కోసం సెంటిమెంట్ వాడుకున్నాడని, ఇప్పుడు శవరాజకీయాలను కౌశిక్ రెడ్డి ప్రోత్సహిస్తున్నాడని ఇది సిగ్గు చేటని అన్నారు. కౌశిక్ రెడ్డి లాంటి దౌర్భాగ్యపు ఎమ్మెల్యేను దేశంలో ఇంతవరకు చూడలేదని అన్నారు. కౌశిక్ రెడ్డికి అంతలా సహాయం చేయాలి అనుకుంటే నేరుగా అధికారులతో మాట్లాడి సహాయం చేయాలి కానీ ఇలాంటి చిల్లర రాజకీయాలు చేయడం మంచిదికాదని అన్నారు.

ఓటు చోరీపై అసత్యపు ప్రచారాలు మానుకో కౌశిక్ రెడ్డి…ప్రణవ్

ఓటు చోరీ జరిగిందని ఆరోపించిన కౌశిక్ రెడ్డికి ఎన్నికల సంఘం గట్టిగా బుద్ధి చెప్పిందని, చెంప చెల్లుమనేలా సమాధానం ఇచ్చిందని ఇప్పటికైనా కౌశిక్ రెడ్డి బుద్ధి మార్చుకోవాలని కోరారు. ఎన్నికల సంఘం గతంలో బిఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఇదే ఓట్లు ఆ అపార్ట్మెంట్ లో ఉన్నాయని సమాధానం ఇవ్వగా బిఆర్ఎస్ నాయకులు తెల్లమొహం వేశారని అన్నారు.

మీడియాతో మాట్లాడుతున్న కాంగ్రెస్ నేత వోడితల ప్రణవ్

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!