Social 1080×1350 • Multi-page
26-10-2025 BREAKING NEWS 11:09 PM
swarnodayam.com
Telugu Daily News

జన వికాస సేవలు అభినందనీయం.. – హ్యూమన్ రైట్స్ డిస్టిక్ వైస్ ప్రెసిడెంట్ పులుగు లతారెడ్డి

జన వికాస సేవలు అభినందనీయం.. – హ్యూమన్ రైట్స్ డిస్టిక్ వైస్ ప్రెసిడెంట్ పులుగు లతారెడ్డి
IMG_20251026_230711

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: జన వికాస సంస్థ అందిస్తున్న సేవలు అభినందనీయమని హుజురాబాద్ కు చెందిన హ్యూమన్ రైట్స్ డిస్టిక్ వైస్ ప్రెసిడెంట్ పులుగు లతారెడ్డి, అలాగే దాతలు ప్రభావతి రెడ్డి, లక్ష్మీ అన్నారు. ఆదివారం హుజురాబాద్ పట్టణంలోని క్లబ్లో నిర్వహించిన అనాధ వృద్ధుల ఆదరణ దినోత్సవానికి హుజురాబాద్ సెంటర్ మేనేజర్ ఖాజాబీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమానికి అధ్యక్షతన నిర్వహించిన జన వికాస సేవలను ప్రశంసించారు. ఈ సందర్భంగా ఫీల్డ్ కో ఆర్డినేటర్ అమూల్య మాట్లాడుతూ సంస్థ ద్వారా ప్రతి సంవత్సరం 32 మంది అనాధ వృద్ధులకు అలాగే నిత్యావసర వస్తువులతో పాటు వారికి కావలసిన సామాగ్రిని దాతల సహకారంతో అందిస్తున్నామని తెలిపారు. జన వికాస సంస్థ కార్యక్రమాలను కూడా వివరించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ తల్లిదండ్రులను కూడా పట్టించుకోని ఈ రోజుల్లో అనాధ వృద్ధులను చేరదీసి ఈ విధంగా సహాయం చేయడం చాలా గొప్ప విషయమని కొనియాడారు. వారి వంతు సహాయ సహకారాలను ఎల్లప్పుడూ అందిస్తూ కార్యక్రమంలో చురుకుగా పాల్గొంటామని వేదిక తరపున హామీ ఇచ్చారు. దివ్యాంగులకు సహాయం చేయడం మనసును కదిలించిందని ఈ సందర్భంగా వెల్లడించారు. ఈ కార్యక్రమంలో అతిథులు, హుజురాబాద్ సెంటర్ మేనేజర్ ఖాజాబీ, కో ఆర్డినేటర్లు రజిత, కళ్యాణి, హైమావతి తదితరులు పాల్గొన్నారు.

Oplus_16908288
Oplus_16908288
Oplus_16908288

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!