Social 1080×1350 • Multi-page
27-10-2025 BREAKING NEWS 09:42 AM
swarnodayam.com
Telugu Daily News

ముస్లిం కమ్యూనిటీ హాల్ కబ్రిస్తాన్ ప్రహరీ గోడ కొరకు 20 లక్షల నిధులు వెంటనే మంజూరు చేయండి

ముస్లిం కమ్యూనిటీ హాల్ కబ్రిస్తాన్ ప్రహరీ గోడ కొరకు 20 లక్షల నిధులు వెంటనే మంజూరు చేయండి
IMG_20251027_093828

– హుజురాబాద్ జామే మస్జిద్ ఈద్గా కబ్రిస్తాన్ మేనేజ్మెంట్ కమిటీ అధ్యక్షులు మొహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ ఆధ్వర్యంలో హుజరాబాద్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ వి ప్రణవ్ కు విజ్ఞప్తి

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: హుజురాబాద్ మండలం సింగాపూర్ గ్రామములో హుజురాబాద్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి వోడితెల ప్రణవ్ గెస్ట్ హౌస్ లో హుజురాబాద్ జామే మస్జిద్ ఈద్గా కబ్రిస్తాన్ మేనేజ్మెంట్ కమిటీ అధ్యక్షులు మొహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ తోపాటు కమిటీ సభ్యులు మహమ్మద్ హబీబ్, మహమ్మద్ యాసిన్ ఖాన్, మహమ్మద్ ఇమ్రాన్ ఖాన్, మొహమ్మద్ తాజుద్దీన్ బాబా, ఇర్ఫాన్, జామి మజీద్ నాయబ్ ఇమామ్ మొహమ్మద్ అబ్దుల్ ఫహీమ్, హుజురాబాద్ జమాతే ఉలేమా అధ్యక్షులు మిర్జా ఇమ్రాన్ బిగ్, మహమ్మద్ అలీమ్, మహమ్మద్ ఖలీద్, మహమ్మద్ కరీంఖాన్ లు హుజురాబాద్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ వి ప్రణవ్ ను కలిసి విజ్ఞప్తి చేశారు. హుజురాబాద్ పట్టణంలో జామే మస్జిద్ ఆవరణములో 10 లక్షల రూపాయలతో కమ్యూనిటీ హాల్ కొరకు మంజూరు చేయాలని, హుజురాబాద్ పట్టణంలో ఎస్సారెస్పీ కెనాల్ ప్రక్కన ఉన్న ముస్లిం ఖబరస్థాన్ ప్రహరీ గోడ నిర్మాణం కొరకు 10 లక్షల రూపాయలు నిధులను వెంటనే మంజూరు చేసినట్లు అయితే ముస్లిం కమ్యూనిటీ హాల్ భవన నిర్మాణం కొరకు మరియు ముస్లిం ఖబ్బరస్థాన్ ప్రహరీ గోడ నిర్మాణం కొరకు 20 లక్షల రూపాయలు మంజూరు చేసినట్లయితే ఈ పనులు నిర్మాణానికి సహకరించిన వారు అవుతారని వి ప్రణవ్ బాబుకు మహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా హుజురాబాద్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ వి ప్రణవ్ బాబు మాట్లాడుతూ నిధులు మంజూరు చేయించడానికి కొంత సమయం పడుతుందని ఆయన అన్నారు. ముస్లింల సంక్షేమం కొరకు నా వంతు నేను ప్రతిసారి పనిచేయడానికి ముందు ఉంటాను అని ఆయన అన్నారు. కనుక మీరు అడిగినప్పుడల్లా నాతోని ఎంత పని అవుతుందో ఆ పనులు చేసి పెడతానని ప్రణవ్ బాబు హామీ ఇచ్చారు. గతంలో ముస్లిం ప్రజల పక్షాన ముస్లిం షాది ఖానా రకు ప్రహరీ గోడ నిర్మాణం కొరకు పది లక్షల రూపాయలు మంజూరు చేయించానని వి ప్రణవ్ బాబు అన్నారు. కనుక మీరందరూ కొంత సమయం ఇచ్చినట్టయితే మిగతా నిధులు కూడా మంజూరు చేయిస్తానని జామే మస్జిద్ కమిటీ అధ్యక్షులు మహమ్మద్ ముజాహిద్ హుస్సేన్, మహమ్మద్ హబీబ్, మహమ్మద్ ఇర్ఫాన్, మహమ్మద్ యాసిన్ ఖాన్, మహమ్మద్ ఇమ్రాన్ ఖాన్, ఇమాములు మొహమ్మద్ అబ్దుల్ ఫహీం, మిర్జా ఇమ్రాన్ బిగ్, కరీం ఖాన్ లకు హామీ ఇచ్చారు.

Oplus_16908288

కాంగ్రెస్ నేత ప్రణవ్ కు వినతి పత్రం అందజేస్తున్న ముజాహిద్ హుస్సేన్, ముస్లిం మైనార్టీ నాయకులు..

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!