27-10-2025 NORMAL NEWS 05:16 PM
swarnodayam.com
Telugu Daily News
27-10-2025 05:16 PM By Mandala Yadagiri

ఘనంగా మాజీ మున్సిపల్ చైర్మన్ వడ్లూరి విజయ్ కుమార్ జన్మదిన వేడుకలు.. – తన సేవలు ఆదర్శప్రాయం. – మానవ విలువల పరిరక్షణ జాతీయ అధ్యక్షుడు, ప్రజాకవి డాక్టర్ నాగుల సత్యంగౌడ్.

ఘనంగా మాజీ మున్సిపల్ చైర్మన్ వడ్లూరి విజయ్ కుమార్ జన్మదిన వేడుకలు.. – తన సేవలు ఆదర్శప్రాయం. – మానవ విలువల పరిరక్షణ జాతీయ అధ్యక్షుడు, ప్రజాకవి డాక్టర్ నాగుల సత్యంగౌడ్.
IMG-20251027-WA0073

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: హుజురాబాద్ మాజీ మున్సిపల్ చైర్మన్ వడ్లూరి విజయ్ కుమార్ నిస్వార్థ సేవలు ఆదర్శప్రాయమని మానవ విలువల పరిరక్షణ జాతీయ అధ్యక్షులు, ప్రజాకవి, రచయిత, తత్వవేత్త, బ్రహ్మశ్రీ డాక్టర్ నాగుల సత్యం గౌడ్ పేర్కొన్నారు. అనంతరం పట్టణంలోని అవంతి కన్వెన్షన్ మీటింగ్ హాల్లో విజయ్ కుమార్ జన్మదిన వేడుకలను ఘనంగా సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా విజయకుమార్ కు పట్టు శాలువా కప్పి, ఆధ్యాత్మిక కవిత సారపు జ్ఞాపికను, బొకే అందజేసి కేకుతో పాటు స్వీటు తినిపించారు. ఈ సందర్భంగా సత్యంగౌడ్ మాట్లాడుతూ… విజయ్ కుమార్ తన దగ్గరికి పేదవారు ఎవరు వచ్చిన తనకు తోచిన సహాయం చేస్తూ, సేవా భావమే జీవిత లక్ష్యంగా ఎంచుకున్న విజయ్ కుమార్ సేవలు అభినందనీయం అన్నారు. తన హయాంలో హుజురాబాద్ మున్సిపల్ చైర్మన్ గా హుజురాబాద్ పట్టణాన్ని ఎంతో అభివృద్ధి చేసి రాష్ట్రంలోనే మంచి పేరు తెచ్చుకోవడం గర్వకారణం అన్నారు. నాయకులంతా ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజల సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కరించినప్పుడే నాయకులుగా మంచి పేరు తెచ్చుకోవడం అవుతుందన్నారు. స్వార్థానికి పాల్పడక మంచి మానవత్వాన్ని పెంపొందించే దిశగా, ప్రతి మనిషి నడుచుకొని మానవ జన్మ ను సార్ధకం చేసుకోవాలని సత్యంగాడు పిలుపునిచ్చారు. వ్యాధి లాంటి స్వార్థం వదులుకోవడంలోనే లోక కళ్యాణం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ జాతీయ ఉపాధ్యక్షులు రుద్రారపు రామచంద్రం, బిఆర్ ఎస్ నాయకుడు పొనగంటి శ్రావణ్, మోలుగూరి ప్రభాకర్, బొడ్డు సంజయ్, తునికి వసంత్, నందగిరి శ్రీనివాస్, కే బాబురావు, వెంకటస్వామి, సాయిల రాజు, జడల సమ్మయ్య, బండ నవీన్, చందు తదితరులు పాల్గొన్నారు.

కేక్ కట్ చేసిన తర్వాత విజయ్ కుమార్ కు కేక్ తినిపిస్తున్న కవి సత్యం గౌడ్..

విజయకుమార్ కు పట్టు శాలువా కప్పి, ఆధ్యాత్మిక కవిత సారపు జ్ఞాపికను, బొకే అందజేస్తున్న కవి సత్యముగౌడ్

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!