Social 1080×1350 • Multi-page
28-10-2025 BREAKING NEWS 11:53 AM
swarnodayam.com
Telugu Daily News

పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా సైకిల్ ర్యాలీ.. – జెండా ఊపి ప్రారంభించిన ఏసీపీ మాధవి.

పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా సైకిల్ ర్యాలీ.. – జెండా ఊపి ప్రారంభించిన ఏసీపీ మాధవి.
IMG-20251028-WA0041

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాల సందర్భంగా కరీంనగర్ జిల్లా హుజురాబాద్ సబ్‌ డివిజన్‌ పరిధిలో సోమవారం సైకిల్ ర్యాలీ నిర్వహించారు. హుజురాబాద్ ఏసీపీ మాధవి పచ్చ జెండా ఊపి సైకిల్ ర్యాలీని ప్రారంభించారు. హుజురాబాద్ పోలీస్‌ స్టేషన్‌ నుంచి ప్రారంభమైన ఈ ర్యాలీ మండలంలోని రాజపల్లి మీదుగా తిరిగి పోలీస్‌ స్టేషన్‌ వద్ద సుమారు 5- 5, 10 కిలోమీటర్ల చొప్పున ముగిసింది. ఈ కార్యక్రమంలో సబ్‌ డివిజన్‌ పరిధిలోని పోలీస్‌ అధికారులు, సిబ్బంది, విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అనంతరం ఏసీపీ వీ మాధవి మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ తమ దైనందిన జీవితంలో వ్యాయామాన్ని తప్పనిసరిగా చేసుకోవాలని, వ్యాయామం ద్వారా అనేక రుగ్మతలను దూరం పెట్టుకోవచ్చని సూచించారు. అలాగే ఈ నెల 30న మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. రక్తదానంలో ప్రతి ఒక్కరూ పాల్గొని పోలీసు అమరవీరులకు నిజమైన నివాళి అర్పించాలని ఆమె పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ కే సమ్మయ్య, హుజురాబాద్ సీఐ కరుణాకర్, రూరల్‌ సీఐ పులి వెంకట్ గౌడ్, జమ్మికుంట సీఐ రామకృష్ణ, రూరల్‌ సీఐ లక్ష్మీనారాయణ, హుజురాబాద్ ఎస్సై యూనస్ అహ్మద్ అలీ, సైదాపూర్ ఎస్సై తిరుపతి, పోలీసు సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.

జెండా ఊపి సైకిల్ ర్యాలీ ప్రారంభిస్తున్న ఏసీపీ మాధవి..

Oplus_16908288

సైకిల్ ర్యాలీలో సైకిల్ తొక్కుతూ పాల్గొన్న ఏసిపి, సీఐలు, ఎస్ఐలు, ప్రజలు..

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!