28-10-2025 NORMAL NEWS 07:24 PM
swarnodayam.com
Telugu Daily News
28-10-2025 07:24 PM By Mandala Yadagiri

“శ్రీ నరేంద్ర మోదీ – నిబద్ధ పరిపాలన దక్షుడు” పుస్తక ఆవిష్కరణ

“శ్రీ నరేంద్ర మోదీ – నిబద్ధ పరిపాలన దక్షుడు” పుస్తక ఆవిష్కరణ
IMG_20251028_173750

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి (నల్లకుంట శంకరమఠం): ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పదేళ్ల పాలనలో సాధించిన విజయాలను విశ్లేషిస్తూ, తెలంగాణ రాష్ట్ర బీసీ కమిషన్ మాజీ ఛైర్మన్ డా. వకుళాభరణం కృష్ణమోహన్‌రావు రచించిన “శ్రీ నరేంద్ర మోదీ – నిబద్ధ పరిపాలన దక్షుడు” అనే గ్రంథాన్ని నేడు నల్లకుంట శంకరమఠంలో శ్రీశృంగేరి శారదా పీఠాధిపతి శ్రీశ్రీ విద్యాశేఖర భారతీ స్వామిజీ వారే ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా స్వామిజీ, గ్రంథంలోని అంశాలపై రచయితతో సమగ్రంగా సంభాషించి వివరాలు తెలుసుకున్నారు. అనంతరం స్వామిజీ, రచయితను ఆశీర్వదించి, ప్రసాదంతో పాటుగా గోడ గడియారాన్ని బహుమతిగా అందజేశారు.

తరువాత మీడియాతో మాట్లాడిన డా. వకుళాభరణం ఇలా అన్నారు:

“మోదీజీ 75వ జన్మదినం సందర్భంగా గత సెప్టెంబర్ 17న నేను ఒక ప్రత్యేక వ్యాసావళి రచించి ఆవిష్కరించాను. కాగా ఇప్పుడు ఆయన పదేళ్ల పాలనలో సాధించిన విజయాలపై సమగ్ర అధ్యయనం చేసి ఈ గ్రంథాన్ని రచించాను. దేశానికే కాక, ప్రపంచానికి అందించిన ఆయన నాయకత్వాన్ని పత్రికా ఆధారాలతో అందరికీ చేరువ చేయడం నా లక్ష్యం.”

శ్రీ నరేంద్ర మోదీ – నిబద్ధ పరిపాలన దక్షుడు” పుస్తక ఆవిష్కరణ చేస్తున్న శ్రీశృంగేరి శారదా పీఠాధిపతి శ్రీశ్రీ విద్యాశేఖర భారతీ స్వామిజీ వారు….

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!