Social 1080×1350 • Multi-page
28-10-2025 BREAKING NEWS 08:26 PM
swarnodayam.com
Telugu Daily News

శ్రీ వర్షితది ప్రభుత్వ హత్యే – విద్యారంగంపై ప్రభుత్వం నిర్లక్ష్యం. – శాతవాహన యూనివర్సిటీ స్టూడెంట్ జేఏసీ

శ్రీ వర్షితది ప్రభుత్వ హత్యే – విద్యారంగంపై ప్రభుత్వం నిర్లక్ష్యం. – శాతవాహన యూనివర్సిటీ స్టూడెంట్ జేఏసీ
IMG-20251028-WA0125

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్:
వంగర గురుకులంలో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్న శ్రీ వర్షిత ది ముమ్మాటికి ప్రభుత్వ హత్యే అని, ప్రభుత్వ నిర్లక్ష్యం మూలంగా ఇంకా ఎందరు విద్యార్థులను బలి తీసుకుంటారని
శాతవాహన యూనివర్సిటీ స్టూడెంట్ లీడర్ జేఏసీ చైర్మన్ చేన్నమల్ల చైతన్య ఆరోపించారు. మంగళవారం హుజురాబాద్ పట్టణంలోని ప్రెస్ క్లబ్ లో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. శ్రీ వర్షిత ఆత్మహత్యకు పాఠశాల ప్రిన్సిపాల్, సిబ్బంది తక్షణమే బాధ్యత వహించాలని, ప్రిన్సిపల్ ను సస్పెండ్ చేయాలని, సిబ్బందికి కూడా మేమో జారీ చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
ఈ దురదృష్టకరమైన సంఘటనపై వెంటనే ప్రభుత్వం స్పందించి బాధిత కుటుంబానికి ఎక్స్గ్రేషియా ప్రకటించి, ఇంట్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని అన్నారు. ఇలాంటి సంఘటనలు మళ్లీ పునరావృతం కాకూడదని హెచ్చరిస్తున్నాం అని, ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు గడుస్తున్న కనీసం విద్యాశాఖ పట్ల ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తుందన్నారు. ఇంతవరకు విద్యాశాఖకు మంత్రి లేకపోవడం సిగ్గుచేటని, తక్షణమే విద్యాశాఖ మంత్రినీ కేటాయించి గురుకులాల్లో మౌలిక సదుపాయాలను వెంటనే పునర్నిర్మానం చేయాలని కోరారు. డార్మెంటరీ రూమ్స్ అన్ని చేంజ్ చేసి తక్షణమే విద్యా రంగానికి బడ్జెట్ ప్రవేశపెట్టి నూతన హాస్టల్స్ భవనాలను నిర్మించాలని కోరారు. విద్యాశాఖ పట్ల ఇంత నిర్లక్ష్యం వహిస్తున్నారంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ ఓసిలలో ఉన్నటువంటి పేద కుటుంబంలో పుట్టినటువంటి పిల్లలకు నాణ్యమైన విద్యను అందించ కూడదనే ప్రభుత్వం భావిస్తుందన్నారు. చదువుకుంటే ప్రశ్నించేతత్వం ఏర్పడుతుందని అతి చిన్న వయసులోనే చాలామంది విద్యార్థులను బలిగొంటున్నరని, ఇలాంటి సంఘటనలు రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడన్నా పునరావృతం అయితే మాత్రం దీనికి రాబోయే రోజులలో విద్యార్థి లోకం కన్నెర్ర చేస్తుందని అన్నారు. అన్ని విద్యార్థి సంఘాలు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం చేసేటువంటి అరాచకత్వాలను ఎండగట్టుతాయని అన్నారు. ఈ కార్యక్రమంలో శాతవాహన యూనివర్సిటీ జేఏసీ నాయకులు అరుణ్ కుమార్, కొండపాక రాకేష్, బండ అశోక్, సురేష్, విక్రమ్, వినయ్, మనోహర్ ,తదితరులు పాల్గొన్నారు.

Oplus_16908288

విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న శాతవాహన యూనివర్సిటీ స్టూడెంట్ లీడర్ జేఏసీ చైర్మన్ చేన్నమల్ల చైతన్య

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!