Social 1080×1350 • Multi-page
28-10-2025 BREAKING NEWS 08:49 PM
swarnodayam.com
Telugu Daily News

సర్దార్ ఐక్యత మార్చ్ విజయవంతం చేయాలి. – బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి మాడ వెంకట్ రెడ్డి

సర్దార్ ఐక్యత మార్చ్ విజయవంతం చేయాలి. – బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి మాడ వెంకట్ రెడ్డి
IMG-20251028-WA0129

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: బిజెపి హుజురాబాద్ పట్టణ అధ్యక్షులు తూర్పాటి రాజు ఆధ్వర్యంలో మంగళవారం స్థానిక శిశుమందిర్ లో సర్దార్ ఐక్యత మార్చ్ సన్నాహక సమావేశం నిర్వహించారు.
స్వాతంత్ర్య సమరయోధులు, ఉక్కుమనిషి సర్దార్ వల్లభాయి పటేల్ 150వ జయంతి సందర్భంగా ఈ నెల 31న కరీంనగర్ లో తెలంగాణ చౌక్ నుండి టవర్ సర్కిల్ వరకు నిర్వహించే కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈ సందర్బంగా దేశంలోని 560 సంస్థానాలను ఒక్క జెండా కిందకు తెచ్చి, భారతదేశాన్ని ఏకం చేసిన మహనీయుడిని ప్రతి ఒక్కరు స్మరించుకోవాలన్నారు.
ఈ కార్యక్రమంలో బిజెపి పట్టణ అధ్యక్షులు తూర్పాటి రాజు, జిల్లా కౌన్సిల్ మెంబర్ రావుల వేణు, బిజెపి జిల్లా కార్యవర్గ సభ్యులు తుముల శ్రీనివాస్, బిజెపి మాజీ పట్టణ అధ్యక్షులు గంగిశెట్టి రాజు, బిజెపి సీనియర్ నాయకులు సబ్బని రమేష్, అంకతీ వాసు, పారుపల్లి కొండల్ రెడ్డి, డోరి ఐలయ్య, భూత్ అధ్యక్షులు క్యాస వెంకటేష్, రాజేష్ ఖన్నా, దేవేంద్ర, మాడిశెట్టి మల్లేశం, గుర్రం సంతోష్, తుర్పాటి రాజశేఖర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

సమావేశంలో మాట్లాడుతున్న బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి మాడ వెంకట్ రెడ్డి

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!