Social 1080×1350 • Multi-page
30-10-2025 BREAKING NEWS 07:45 PM
swarnodayam.com
Telugu Daily News

సింగపూర్ లో రైతుల ధర్నా.. డిబిఎల్ కంపెనీ నిర్లక్ష్యం వల్లే పంటలు మునిగాయని ఆరోపణ.

సింగపూర్ లో రైతుల ధర్నా.. డిబిఎల్ కంపెనీ నిర్లక్ష్యం వల్లే పంటలు మునిగాయని ఆరోపణ.
IMG-20251030-WA0086(1)

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి, హుజురాబాద్: కరీంనగర్ జిల్లా హుజురాబాద్ మండలం సింగాపూర్ గ్రామం వద్ద డిబిఎల్ కంపెనీ నిర్లక్ష్యం వల్ల వంటలు నష్టపోయిన రైతులు గురువారం జాతీయ రహదారిపై ధర్నా, రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… డిబిఎల్ కంపెనీ చేస్తున్న రోడ్డు నిర్మాణ పనులు ఆలస్యంగా చేయడం వల్ల రైతులు తీవ్రంగా పంటలు నష్టపోయారని అన్నారు. పనులు చేయడంలో నిర్లక్ష్యం వల్ల 150 ఎకరాల వరి పంట రైతులు నష్టపోయారని దీనికి నష్టపరిహారం ఎవరు చెల్లిస్తారని వారు ప్రశ్నించారు. సింగపూర్ చెరువు వద్ద సరైన బ్రిడ్జి నిర్మాణం చేయకపోవడం వల్ల రైతులు నష్టపోవాల్సి వచ్చిందన్నారు. రైతులు చేపట్టిన ధర్నా వల్ల ప్రధాన రహదారిపై రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. రైతుల ధర్నా సమాచారం తెలుసుకున్న హుజురాబాద్ టౌన్ సిఐ కరుణాకర్ తన సిబ్బందితో వెళ్లి రైతులతో మాట్లాడి వారిని శాంతింప చేశారు. దీంతో రైతులు ధర్నా విరమించారు. ఈ కార్యక్రమంలో తుమ్మనపల్లి సింగిల్ విండో చైర్మన్ కౌర్ సుగుణాకర్ రెడ్డి, గ్రామ రైతులు పాల్గొన్నారు.

పంటలకు నష్టపరిహారం చెల్లించాలని కరీంనగర్ – వరంగల్ ప్రధాన రహదారిపై ధర్నా రాస్తారోకో చేస్తున్న సింగపూర్ గ్రామ రైతులు..
Oplus_16908288

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!