30-10-2025 NORMAL NEWS 08:05 PM
swarnodayam.com
Telugu Daily News
30-10-2025 08:05 PM By Mandala Yadagiri

పంట నష్టపోయిన రైతుల వివరాల సేకరణ

పంట నష్టపోయిన రైతుల వివరాల సేకరణ
IMG_20251030_200232

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్:
ముంతా తుఫాన్ కారణంగా కురిసిన భారీ వర్షంతో
హుజురాబాద్ మండలంలో దెబ్బతిన్న పంటలను గురువారం వ్యవసాయ శాఖ అధికారులు సందర్శించి వివరాలు సేకరించారు. హుజురాబాద్ ఏడిఏ సునీత, హుజురాబాద్ ఏవో భూమిరెడ్డిలు పలు పంటలను పరిశీలించి రైతులతో మాట్లాడారు. మండలంలో పంట నష్టపోయిన రైతుల వివరాలను నమోదు చేయటం జరుగుతుందని, రైతులు అధైర్య పడొద్దని, భరోసాగా ప్రభుత్వం ఉంటుందని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఏఈఓ నిఖిల్ కుమార్, పలువురు రైతులు పాల్గొన్నారు.

Oplus_16908288
Oplus_16908288
Oplus_16908288

అకాల వర్షానికి దెబ్బతిన్న పంటలను పరిశీలిస్తున్న ఏడీఏ సునీత, ఏవో భూమిరెడ్డి, ఏఈఓ లు, రైతులు..

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!