Social 1080×1350 • Multi-page
31-10-2025 BREAKING NEWS 11:20 PM
swarnodayam.com
Telugu Daily News

నష్టపోయిన రైతులకు అండగా ప్రభుత్వం.. – కాంగ్రెస్ ఇంచార్జి ఒడితల ప్రణవ్ బాబు

నష్టపోయిన రైతులకు అండగా ప్రభుత్వం.. – కాంగ్రెస్ ఇంచార్జి ఒడితల ప్రణవ్ బాబు
IMG_20251031_231408

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్:
ఇటీవల మొంథా తుఫాను వల్ల పంటలు నష్టపోయిన రైతన్నలకు ప్రభుత్వం అండగా ఉంటుందని హుజురాబాద్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి ఒడితల ప్రణవ్ బాబు అన్నారు. శుక్రవారం హుజురాబాద్ మండలం జూపాక గ్రామంలో దెబ్బతిన్న రోడ్లను, పంట పొలాలను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…తుఫాను వల్ల జరిగిన నష్టాన్ని ,పరిస్థితిని అంచనా వేస్తున్నామని, ఇప్పటికే ప్రభుత్వానికి ప్రాథమిక అంచనా నివేదికను అందజేశామని, రైతులెవరూ అధైర్యపడవద్దని అన్నారు. రైతు ప్రభుత్వంగా అన్నదాతలను ఆదుకుంటామని తెలిపారు. దెబ్బతిన్న రోడ్లకు మరమ్మతులు చేయిస్తామని, ముఖ్యమంత్రి, మంత్రుల దృష్టికి తుఫాన్ కారణంగా దెబ్బతిన్న వివరాలను అందజేసి ఆదుకుంటామని తెలిపారు.కాగా పలువురు రైతులతో ఆయన మాట్లాడారు. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం సకాలంలో తీసుకునేలా ఇప్పటికే ఆదేశాలు ఇచ్చామని,ప్రభుత్వం రైతు పండించిన చివరి గింజ వరకు కొనుగోలు చేస్తుందని అన్నారు. ఆయన వెంట పలువురు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.

దెబ్బతిన్న రోడ్లను, పొలాలను పరిశీలిస్తున్న కాంగ్రెస్ నేత ప్రణవ్

పంటల నష్టంపై రైతులను వివరాలు అడిగి తెలుసుకుంటున్న కాంగ్రెస్ నేత ప్రణవ్

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!