Social 1080×1350 • Multi-page
01-11-2025 BREAKING NEWS 09:52 AM
swarnodayam.com
Telugu Daily News

సంక్షేమ హాస్టల్లో ఆత్మహత్య చేసుకున్న శ్రీవర్షిత కుటుంబాన్ని పరామర్శించిన ఎంపీ ఈటల రాజేందర్

సంక్షేమ హాస్టల్లో ఆత్మహత్య చేసుకున్న శ్రీవర్షిత కుటుంబాన్ని పరామర్శించిన ఎంపీ ఈటల రాజేందర్
IMG_20251101_093718

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: హనుమకొండ జిల్లా వంగర సంక్షేమ హాస్టల్లో ఆత్మహత్య చేసుకున్న శ్రీవర్షిత కుటుంబాన్ని మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ శుక్రవారం రాత్రి పరామర్శించారు. వర్షిత చిత్రపటానికి పూలు వేసి నివాళులర్పించారు. అనంతరం వర్షిత తల్లిదండ్రులను పరామర్శించి మృతి చెందిన తీరును అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఈటల మాట్లాడుతూ వర్నమెంట్ రెసిడెన్షియల్ స్కూల్స్ లో వేలాదిమంది మధ్యతరగతి పిల్లలు చదువుకుంటున్నారనీ, ఎంత గొప్ప ఆలోచనతో ఈ స్కూల్స్ ప్రారంభం అయ్యాయో… అలాంటి స్కూల్స్ లో డైట్ చార్జెస్ రాకపోవడం, స్టాఫ్ లేకపోవడం, వార్డెన్స్ లేకపోవడం, క్లాసులు చెప్పే టీచర్స్ పిల్లలను చూసుకోవాల్సిన పరిస్థితి వచ్చిందనీ, ఇలా అనేక రకాల సమస్యలు ఉన్నాయి అన్నారు.

600 మంది విద్యార్థులు ఉన్నచోట హెల్త్ చెకప్ లు, మానసిక ఒత్తిడిలు కలగకుండా సైకియాట్రిస్టులతో ఇంట్రాక్ట్ చేయాలని గతంలో చెప్పాము అని గుర్తు చేశారు. ఫెసిలిటీస్, కోఆర్డినేషన్ లేకపోవడం వల్ల పిల్లలు ఆత్మహత్యలు చేసుకోవడం జరుగుతుందనీ, ఇలాంటివి జరిగినప్పుడు తూతూ మంత్రంగా ఎంక్వైరీ వేసి, పిల్లల మానసిక స్థితి బాలేదని వాళ్ల మీద నెట్టే ప్రయత్నం చేస్తున్నారనీ ఈటెల ఆరోపించారు.

వర్షిత మొదటి నుండి కూడా మంచిగా చదువుకునే అమ్మాయి అని, చదువు పట్ల, ఎగ్జామ్స్ పట్ల టెన్షన్ లేని అమ్మాయి స్కూల్లో టాపర్ గా ఉంటూ నాయకత్వం వహించే అమ్మాయి ఈరోజు చనిపోయిందంటే బలమైన కారణాలు ఉంటాయి.. అని అన్నారు. ఆ కారణాలు ఏంటో తెలుసుకొని బాధ్యులను శిక్షించి రాబోయే కాలంలో ఇలాంటివి చూడకుండా ఉండాల్సిన బాధ్యత ప్రభుత్వాలపైన ఉంటుందనీ డిమాండ్ చేశారు.

శ్రీ వర్షిత చిత్రపటం వద్ద పూలు వేసే నివాళులర్పిస్తున్న ఎంపీ ఈటెల రాజేందర్..

శ్రీ వర్షిత కుటుంబ సభ్యులను పరామర్శిస్తున్న ఎంపీ ఈటెల రాజేందర్..

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!