Social 1080×1350 • Multi-page
01-11-2025 BREAKING NEWS 10:57 PM
swarnodayam.com
Telugu Daily News

సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేసిన కాంగ్రెస్ నేత ప్రణవ్ బాబు

సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేసిన కాంగ్రెస్ నేత ప్రణవ్ బాబు
IMG_20251101_231158

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి, హుజురాబాద్:
హుజురాబాద్ నియోజకవర్గంలో వివిధ మండలాలను ఆరోగ్య సమస్యల కోసం దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారులకు శనివారం హుజురాబాద్ పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో 135 సీఎంఆర్ఎఫ్ చెక్కులను హుజురాబాద్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి ఒడితల ప్రణవ్ బాబు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…పేదవారి పట్ల, ఆరోగ్య రీత్యా హాస్పిటల్ లో చేరికైన వారికి మానవతా దృక్పథంతో అందించే సీఎంఆర్ఎఫ్ చెక్కుల విషయంలో ఎలాంటి జాప్యం వహించకుండా చెక్కులు వచ్చిన వెంటనే లబ్ధిదారులకు అందజేస్తున్నామని అన్నారు. మొత్తం 47,62,000 రూపాయల విలువ చేసే 135 చెక్కులలో-హుజురాబాద్ మండలానికి 41 చెక్కులు, జమ్మికుంట మండలానికి 26 చెక్కులు, వీణవంక మండలం 37 చెక్కులు, కమలాపూర్ మండలం 31 చెక్కులు లబ్ధిదారులకు అందజేసినట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు లబ్ధిదారులు పాల్గొన్నారు

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!