Social 1080×1350 • Multi-page
02-11-2025 BREAKING NEWS 06:46 PM
swarnodayam.com
Telugu Daily News

నేషనల్ లెవెల్ ఓపెన్ కరాటే ఛాంపియన్షిప్ పోటీలలో హుజురాబాద్ విద్యార్థుల ప్రతిభ

నేషనల్ లెవెల్ ఓపెన్ కరాటే ఛాంపియన్షిప్ పోటీలలో హుజురాబాద్ విద్యార్థుల ప్రతిభ
Oplus_16908288

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: గ్లోబల్ శోటోకాన్ కరాటే డో ఇండియా కరీంనగర్ జిల్లా అసోసియేషన్ అధ్యక్షుడు ఎస్కే జలీల్ ఆధ్వర్యంలో కరాటే శిక్షణ పొందుతున్న హుజురాబాద్ కరాటే విద్యార్థులు కాజీపేట లోని పరిధిలో ఎజిఆర్ గార్డెన్స్ లోని శోటోకాన్ కరాటే డు అకాడమీ వారి ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన నేషనల్ లెవెల్ ఓపెన్ కరాటే ఛాంపియన్షిప్ పోటీలలో పాల్గొని హుజురాబాద్ విద్యార్థుల అత్యంత ప్రతిభ కనబరిచినట్లు ఆయన తెలిపారు. ఈ సందర్భంగా సీనియర్ బ్లాక్ బెల్ట్ కేటగిరి 14 సంవత్సరాల విభాగంలో ఎస్కే సాదుల్లా బాబా కటాస్ లో గోల్డ్ మెడల్ సాధించగా, ఇంద్రనగర్ కు చెందిన 14 సంవత్సరాల అమ్మాయిల విభాగంలో జున్ను కావ్య కటాస్ లో గోల్డ్ మెడల్ సాధించారన్నారు. అలాగే ఏడు సంవత్సరాల జూనియర్ విభాగంలో జి నక్షత్ర కటాస్ లో గోల్డ్ మెడల్, 13 సంవత్సరాలు ఆల్ కలర్ బెల్స్ విభాగంలో సిహెచ్ సాయిచరణ్ కటాస్ గోల్డ్ మెడల్, ఏడు సంవత్సరాల అమ్మాయిల విభాగంలో పి సహస్ర కటాస్ లో గోల్డ్ మెడల్, ఐదు సంవత్సరాల అమ్మాయిల విభాగంలో పినిసి కటాస్ సిల్వర్ మెడల్, 8 సంవత్సరాల అమ్మాయిల విభాగంలో పి కిరణ్ కటాస్ లో గోల్డ్ మెడల్, ఏడు సంవత్సరాల వైట్ బెల్టు కేటగిరిలో అమన్ కటాస్ లో గోల్డ్ మెడల్ సాధించారన్నారు. జాతీయ స్థాయి కరాటే పోటీలలో పాల్గొని పెద్ద ఎత్తున బహుమతులు సాధించిన విద్యార్థులను హుజురాబాద్ టౌన్ సీఐ కరుణాకర్, తెలంగాణ రాష్ట్ర ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల సంక్షేమ సంఘం అధ్యక్షుడు మొహమ్మద్ హుస్సేన్, తెలంగాణ ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ కరీంనగర్ జిల్లా శాఖ అధ్యక్షుడు చందుపట్ల జనార్ధన్, న్యూ కాకతీయ మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ బి రాజ్ కుమార్, డైరెక్టర్ వి గోపాల్, ముదిరాజ్ సంఘం జిల్లా నాయకులు కొలిపాక సమ్మయ్య, కాంగ్రెస్ నాయకులు ఉప్పు శ్రీనివాస్ పటేల్, అంబేడ్కర్ జయంతి ఉత్సవ కమిటీ మాజీ అధ్యక్షులు ఎండి ఖలీద్ హుస్సేన్ లు అభినందించి హర్షం వ్యక్తం చేశారు.

జాతీయస్థాయి కరాటి పోటీలలో అత్యంత ప్రతిభ కనబరిచి మెడల్స్, సర్టిఫికెట్స్ సాధించిన కరాటే విద్యార్థులతో మాస్టర్ జలీల్, అతిథులు..

Oplus_16908288
ప్రతిభ కనబరిచిన విద్యార్థులను అభినందిస్తున్న అతిథులు..

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!