04-11-2025 NORMAL NEWS 05:14 PM
swarnodayam.com
Telugu Daily News
04-11-2025 05:14 PM By Mandala Yadagiri

ఉపాధ్యాయుడు కొట్టాడని ఇద్దరు విద్యార్థులు ఆత్మహత్యాయత్నం! జమ్మికుంటలో ఏబీవీపీ ధర్నా.. – స్వామి వివేకానంద హైస్కూల్ వద్ద ఉద్రిక్తత

ఉపాధ్యాయుడు కొట్టాడని ఇద్దరు విద్యార్థులు ఆత్మహత్యాయత్నం! జమ్మికుంటలో ఏబీవీపీ ధర్నా.. – స్వామి వివేకానంద హైస్కూల్ వద్ద ఉద్రిక్తత
IMG-20251104-WA0094

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్ (జమ్మికుంట):కరీంనగర్ జిల్లా జమ్మికుంటలోని స్వామి వివేకానంద స్కూల్లో ఇద్దరు 9వ తరగతి విద్యార్థులను ఓ ఉపాధ్యాయుడు తీవ్రంగా కొట్టగా అందుకు మనస్థాపంతో ఆ ఇద్దరు విద్యార్థులు ఆత్మహత్య ప్రయత్నం చేశారు. పరిస్థితి విషమంగా ఉండగా ప్రస్తుతం సంజీవని ప్రైవేటు ఆసుపత్రిలో పిల్లలకు చికిత్స అందిస్తుండగా బాధిత కుటుంబీకులు పాఠశాల ముందు ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో ఘటన స్థలానికి పోలీసు చేరుకొని ఆందోళన విరమించేందుకు ప్రయత్నించారు. కాగా
రంగంలోకి దిగిన పైరవీ కారులు సయోధ్య కుదిరిచ్చే ప్రయత్నం చేస్తున్నారనీ పలువురు ఆరోపిస్తున్నారు. అలాగే ఏబీవీపీ నాయకులు పాఠశాల వద్ద ధర్నా నిర్వహించారు.

ఈ విషయంపై రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు గోస్కుల అజయ్ మాట్లాడుతూ కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణంలోని స్వామి వివేకానంద హైస్కూల్లో ఇద్దరు విద్యార్థులను ఉపాధ్యాయుడు కొట్టడం వలన దెబ్బలు భరించలేక ఆత్మహత్యాయత్నం చేశారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం సృష్టించింది. వివరాల్లోకి వెళ్తే, పాఠశాలకు చెందిన విద్యార్థులు రామ్ చరణ్ మరియు చరణ్ లను స్వామి వివేకానంద హైస్కూల్ లోనీ ఉపాధ్యాయుడు తమను కొట్టాడన్న మనస్తాపంతో గడ్డి మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు.
విద్యార్థులను వెంటనే ఆసుపత్రికి తరలించారు. ఈ విషయాన్ని తెలుసుకున్న విద్యార్థి సంఘం అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధ్యులైన ఉపాధ్యాయులు, ఎంఈఓపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనకు నిరసనగా ఏబీవీపీ నాయకులు వెంటనే స్వామి వివేకానంద హైస్కూల్ ముందు ధర్నా నిర్వహించారు. విద్యార్థులు ఆత్మహత్యాయత్నం చేసుకోవడానికి కారణమైన సంబంధిత ఉపాధ్యాయుడిని మరియు పాఠశాల పరిపాలనా లోపాలకు బాధ్యులైన వారిని వెంటనే మండల విద్యాధికారి (ఎంఈఓ)తక్షణమే స్పందించి తక్షణ చర్యలు తీసుకోవాలని ఏబీవీపీ నాయకులు డిమాండ్ చేశారు.
ఏబీవీపీ నాయకులు మాట్లాడుతూ, “పాఠశాలలో ఉపాధ్యాయులు విద్యార్థులను ఇంత దారుణంగా కొట్టడం అమానుషం అన్నారు. మానసికంగా కృంగిపోయి విద్యార్థులు ప్రాణాలు తీసుకోవడానికి ప్రయత్నించడం విచారకరం అన్నారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకునేంత వరకు తమ పోరాటం ఆగదు” అని హెచ్చరించారు. అలాగే ఈ పురుగుల మందు అమ్మిన వ్యక్తిపై పోలీస్ కేసులు నమోదు చెయ్యాలని కోరుతున్నామన్నాడు.
ఈ కార్యక్రమంలో ఏబీవీపీ నగర కార్యదర్శి పాలిక నిరూప్, నగర సంయుక్త కార్యదర్శి అరిఫ్, ఉపాధ్యక్షులు అనిల్, సోషల్ మీడియా కన్వీనర్ రోహిత్, ఆఫ్రిద్, అబ్బు తదితరులు పాల్గొన్నారు.

పాఠశాల వద్ద ధర్నా నిర్వహిస్తున్న ఏబీవీపీ నాయకులు..

సంఘటన స్థలానికి చేరుకొని ఆందోళన విరమించాల్సిందిగా కోరుతున్న పోలీసులు..

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!