Social 1080×1350 • Multi-page
04-11-2025 BREAKING NEWS 09:42 PM
swarnodayam.com
Telugu Daily News

బాల్య వివాహాల వల్ల భవిష్యత్తు డొల్ల.. – బాల్య వివాహాలు, బాలల హక్కులపై అవగాహన

బాల్య వివాహాల వల్ల భవిష్యత్తు డొల్ల.. – బాల్య వివాహాలు, బాలల హక్కులపై అవగాహన
IMG-20251104-WA0124

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్ నవంబర్ 4: సమాజంలోని బాల బాలికలకు18 సంవత్సరాల వయస్సు నిండని బాల్య వివాహాలు చేయడం వల్ల వారి భవిష్యత్తు అంధకారంలోకి వెళ్ళిపోతుందని జిల్లా బాలల పరిరక్షణ విభాగం సోషల్ వర్కర్ మాడుగుల రమేష్ అన్నారు. హుజురాబాద్ మండలం సింగపూర్ గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మహిళ, పిల్లల, వికలాంగుల మరియు వయోవృద్ధుల శాఖలోని జిల్లా బాలల పరిరక్షణ విభాగం ఆధ్వర్యంలో బాల బాలికలకు బాల్య వివాహాలు, బాలల హక్కులపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమాజంలో బాల్యవివాహాలు చేయడం అనేది బాలల భవిష్యత్తును నాశనం చేస్తుందనీ, చదువుకునే బాలికలకు తెలిసి తెలియని వయసులో వివాహాలు చేయడం వల్ల శారీరక మానసిక ఇబ్బందులు ఎదురవుతాయన్నారు. దీనివల్ల వారు ఎంచుకున్న గమ్యాన్ని చేరుకోలేక అనేక అవకాశాలు వివాహల చేయడం వల్ల కోల్పోతారన్నారు. ఎక్కడైనా ఎవరైనా బాల్యవివాహాలు జరిపే ప్రయత్నాలు చేస్తున్నారని తెలిసిన వెంటనే చైల్డ్ హెల్ప్ లైన్ -1098కు మరియు చైల్డ్ హెల్ప్ డెస్క్-9490881098 కు సమాచారం అందించాలని కోరారు. సమాచారం ఇచ్చిన వాల్ల వివరాలు గోప్యంగా ఉంచబడతాయనీ, బాల్య వివాహాలు జరిపించినా వారికి మరియు ప్రోత్సహించినా వారికి చట్ట ప్రకారం రెండు సంవత్సరాలు జైలు శిక్ష లేదా లక్ష రూపాయల జరిమానా లేదా రెండు విధించబడతాయి, జరిమానా విధించబడుతుంది అన్నారు. పిల్లలకి పెద్దవాళ్లలాగానే అనేక రకాల హక్కులు ఉన్నాయి అన్నారు. వారి హక్కులను సద్వినియోగం చేసుకునే విధంగా సమాజంలో పెద్దలందరూ బాధ్యతగా ఉండాలన్నారు. వారి హక్కులకు ఎక్కడ భంగం కలగకుండా జాగ్రత్తలు తీసుకునే బాధ్యత మనందరి పైన ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ఇంచార్జి హెడ్మాస్టర్ఎల్ రాంప్రసాద్, ఉపాధ్యాయులు పుష్పలత, ఉమాదేవి, విద్యార్డులు పాల్గొన్నారు.

విద్యార్థులకు అవగాహన కల్పిస్తున్న జిల్లా బాలల పరిరక్షణ విభాగం సోషల్ వర్కర్ మాడుగుల రమేష్

విద్యార్థులతో రమేష్, ఉపాధ్యాయులు..

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!