Social 1080×1350 • Multi-page
06-11-2025 BREAKING NEWS 06:27 AM
swarnodayam.com
Telugu Daily News

వరుస దొంగతనాలకు పాల్పడుతున్న ఆటో డ్రైవర్ అరెస్టు.

వరుస దొంగతనాలకు పాల్పడుతున్న ఆటో డ్రైవర్ అరెస్టు.
IMG_20251105_233517

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్ (జమ్మికుంట): జమ్మికుంట మండల కేంద్రంలో వరుస దొంగతనాలకు పాల్పడిన ఆటో డ్రైవర్, మాజీ జీవిత ఖైదీని పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. జమ్మికుంట పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో హుజురాబాద్ ఏసిపి వి మాధవి మాట్లాడుతూ గతంలో భార్యను హత్య చేసి జీవిత ఖైదు శిక్ష పడి ఇటీవల సత్ప్రవర్తనతో బయటికి వచ్చిన సోమ సారయ్య దొంగతనాలకు పాల్పడినట్లు వెల్లడించారు. శిక్ష అనుభవిస్తున్న కాలంలో పలువురు దొంగలతో స్నేహం చేసి దొంగతనాలు చేసే మెలకువలు నేర్చుకున్న సారయ్య పట్టణంలోని ఎస్ఎల్ ఎస్ జువెలరీ షాప్ తో పాటు పలు ఇండ్లలో దొంగతనానికి పాల్పడినట్లు పేర్కొన్నారు. ఇప్పటివరకు ఐదు దొంగతనాలు చేయగా కిలోన్నర వెండి, 5 గ్రాముల బంగారం, 38 వేల నగదుతో పాటు ఆటోను స్వాధీనం చేసుకొని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించినట్లు ఏసిపి మాధవి వెల్లడించారు. ఈ సమావేశంలో టౌన్ సిఐ సుదగోని రామకృష్ణగౌడ్ తో పాటు ఎస్సైలు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

దొంగను అరెస్టు చెబుతున్న ఏసిపి మాధవి పక్కన సిఐ…

Oplus_16908288

దొంగను పట్టుకోవడంలో ప్రతిభ కనబరిచిన పోలీసులను నగదు బహుమతితో సత్కరిస్తున్న ఏసిపి మాధవి, పక్కన సిఐ రామకృష్ణ గౌడ్, ఎస్ఐ సతీష్ తదితరులు..

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!