Social 1080×1350 • Multi-page
06-11-2025 BREAKING NEWS 07:55 PM
swarnodayam.com
Telugu Daily News

ఎంపిటిసి, జడ్పిటిసిలను గెలిపించి ఇవ్వండి.. హుజురాబాద్ కు పూర్వ వైభవం తీసుకువస్తా.. – బిజెపి జాతీయ నాయకుడు మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్

ఎంపిటిసి, జడ్పిటిసిలను గెలిపించి ఇవ్వండి.. హుజురాబాద్ కు పూర్వ వైభవం తీసుకువస్తా.. – బిజెపి జాతీయ నాయకుడు మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్
IMG-20251106-WA0047

– సర్పంచులను, ఎంపీటీసీలను గెలిపించండి

– ప్రజలకు పిలుపునిచ్చిన ఎంపీ ఈటల రాజేందర్

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్ (కమలాపూర్):ఎంపిటిసి, ఎంపీపీ, జడ్పిటిసిలను గెలిపించి ఇవ్వండి, హుజురాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంకు పూర్వ వైభవం తిరిగి తీసుకొచ్చే బాధ్యత తనదేనని బీజేపీ జాతీయ నాయకుడు, మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ అన్నారు. కమలాపూర్ మండల కేంద్రంలో మండలంలోని శనిగరం, శంభునిపల్లి, దేశరాజు పల్లి, గోపాల్ పూర్, కమలాపూర్, జమ్మికుంట, మడిపల్లి, మడిపల్లి గ్రామాల వారితో పాటు పాత మిత్రుడు రాజు బీజేపీలో చేరారు. అనంతరం పలువురు నాయకులు, కార్యకర్తలతో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో సర్పంచులు, ఎంపీటీసీలు, ఎంపీపీలు, జడ్పీటీసీలను గెలిపించి ఇవ్వాలని ప్రజలను కోరారు. ప్రజలకు కావలసిన అభివృద్ధి పనులు చేయించడం తన బాధ్యతగా తీసుకుంటానన్నారు. హుజురాబాద్ ప్రజలతో నాకు 25 ఏళ్ల అనుబంధం ఉంది. నేను మంత్రి కాకముందే జమ్మికుంట బ్రిడ్జి, కమలాపూర్ విద్యా హబ్, అనేక సబ్ స్టేషన్లు ఏర్పాటు చేశానని తెలిపారు.
అధికారంలో లేకపోయినా కూడా పనులు ఆగలేదని, ప్రభుత్వ పనులు ఎవరి జాగీరు కావు, ప్రజల హక్కులు మాత్రమే అని చెప్పారు. 2021 తర్వాత నిధులు ఆపిన మూర్ఖపు ప్రభుత్వం, మూర్ఖపు ముఖ్యమంత్రి వల్ల అభివృద్ధి ఆగిపోయిందన్నారు. కానీ నేను ఉన్నంత వరకూ హుజురాబాద్ అభివృద్ధి ఆగదు, హైదరాబాదులో ఉన్నా కూడా పాత పనులన్నీ పూర్తి చేస్తున్నాను అని రాజేందర్ పేర్కొన్నారు. దళిత బంధు, ఇందిరమ్మ ఇళ్లు, సిమెంట్ రోడ్లు ఇవన్నీ రావడానికి కారణం నేనే. దళితుల, పేదల కోసం పోరాటం చేస్తూనే ఉంటాను. డబ్బు, మద్యం రాజ్యం పోవాలంటే ధర్మానికి ఓటు వేయండంటూ పిలుపునిచ్చారు. ప్రజల్లో
నాలుకలా ఉండే నాయకున్ని గెలిపించుకోండి, ప్రజల్లో నాలుక లాగా ఉండే నాయకుడిని గెలిపించుకోండి అని పిలుపునిచ్చారు. గాడిదలకు గడ్డి వేసి ఆవులకు పాలు పెడితే రావు అని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో సీనియర్ బిజెపి నాయకులు, మాజీ ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

బిజెపిలో చేరిన వారికి పార్టీ కండువా కప్పి ఆహ్వానిస్తున్న ఎంపీ ఈటెల రాజేందర్..

నాయకులు, కార్యకర్తలు సమావేశంలో మాట్లాడుతున్న ఎంపీ ఈటల

పెద్ద ఎత్తున తరలివచ్చిన పార్టీ నాయకులు, కార్యకర్తలు..

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!