Social 1080×1350 • Multi-page
07-11-2025 BREAKING NEWS 06:24 AM
swarnodayam.com
Telugu Daily News

ఫేక్ కాల్ తో తీవ్ర ఒత్తిడికి గురైన తండ్రి.. – హై బీపీతో ఆసుపత్రి పాలు

ఫేక్ కాల్ తో తీవ్ర ఒత్తిడికి గురైన తండ్రి.. – హై బీపీతో ఆసుపత్రి పాలు
IMG_20251107_062011

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: సైబర్ నేరగాళ్లు చేసిన ఫేక్ కాల్ తో తన కొడుకుకు ఏమైందో నని ఆవేదన చెందిన ఓ తండ్రి తీవ్ర మానసిక ఒత్తిడికి లోనై ఆస్పత్రి పాలైన సంఘటన హుజురాబాద్ లో జరిగింది. వివరాలలోకి వెళ్తే… హుజురాబాద్ మున్సిపల్ పరిధిలోని బోర్నపల్లికి చెందిన మాసాడి లక్ష్మణరావు అనే వ్యక్తి కుమారుడు కొన్నేళ్లుగా అమెరికాలో ఉంటున్నాడు. కాగా గురువారం లక్ష్మణరావుకు పోలీసుల పేరుతో మీ కుమారుడు నేరం చేశాడు, మా కస్టడీలో ఉన్నాడు, మీరు తొమ్మిది లక్షలు చెల్లించాలని ఫోన్ వచ్చింది. దీంతో ఆందోళన చెందుతున్న లక్ష్మణరావుకు కొద్దిసేపు తర్వాత మరో కాల్ వచ్చింది. ఎ ఐ సాంకేతికను ఉపయోగించి తన కొడుకు మాట్లాడినట్లుగా నాన్న నన్ను వీళ్లు కొడుతున్నారు కాపాడు అంటూ కొడుకు ఏడుస్తూ ఉండడంతో ఆందోళన చెందిన లక్ష్మణరావు హుజురాబాద్ పోలీస్ స్టేషన్కు వచ్చి పోలీసులకు వివరిస్తూ ఉండగానే తీవ్ర మానసిక ఒత్తిడి గురైన ఆయన పోలీస్ స్టేషన్లో అనారోగ్యానికి గురయ్యాడు వెంటనే అతడిని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు అనంతరం వారి కుటుంబ సభ్యులు హనుమకొండలోని ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించి చికిత్స జరిపించారు. ఈ సందర్భంగా ఎస్సై యూనస్ అలీ మాట్లాడుతూ… ఫేక్ కాల్స్ నమ్మకూడదని, అనుమానాస్పదంగా ఉండే ఏ ఫోన్ కాల్స్ వచ్చిన భయపడకుండా పోలీసులను సంప్రదించాలని డబ్బులు ఎవరికి ఇవ్వరాదని అన్నారు

సైబర్ నేరగాళ్లు ఫేక్ కాల్ చేసిన ఊహ చిత్రం..

కేసు నమోదు చేసిన హుజురాబాద్ పోలీసులు..

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!