Social 1080×1350 • Multi-page
07-11-2025 BREAKING NEWS 11:54 PM
swarnodayam.com
Telugu Daily News

శతవసంతాలు పూర్తిచేసుకున్న భారత”హాకీ”…హుజూరాబాద్ అంటేనే “హాకీ”…”హాకీ” అంటేనే హుజూరాబాద్

శతవసంతాలు పూర్తిచేసుకున్న భారత”హాకీ”…హుజూరాబాద్ అంటేనే “హాకీ”…”హాకీ” అంటేనే హుజూరాబాద్
IMG-20251107-WA0056

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్:


భారత దేశంలో అత్యంత ప్రతీస్టాత్మమైన “హాకీ”క్రీడ వంద సంవత్సరాలు (07-11.1925 నుండి 07-11-2025) పూర్తిచేసుకున్న సందర్భంగా దేశవ్యాప్తంగా హాకీ క్రీడాకారులు పండగ జరుపుకున్నారు.
అందులో భాగంగానే శుక్రవారం కరీంనగర్ జిల్లా హాకీ అసోసియేషన్ ఆధ్వర్యంలో హాకీ క్రీడ శతవసంతాల ఉత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు.
తెలంగాణ రాష్ట్రంలో హాకీ క్రీడకు ప్రసిద్ధి చెందిన హుజూరాబాద్ ప్రాంతంలో గత ఏడు దశాబ్దాలుగా అనేక మంది క్రీడాకారులు తమ ప్రతిభను కనబరిచి హుజూరాబాద్ హాకీ క్రీడా ఖ్యాతిని దశదిశలా వ్యాప్తి చేశారు.
హుజూరాబాద్ లో హాకీ క్రీడకు పునాదివేసిన ఆనాటి ఉపాధ్యాయులు జి.పాండురంగా చారి గారిని స్మరించుకోవడం మనందరి బాధ్యత. హుజూరాబాద్ అంటేనే “హాకీ”…”హాకీ” అంటేనే హుజూరాబాద్అని రాష్ట్ర వ్యాప్తంగా పేరు తీసుకువచ్చిన హాకీ క్రీడాకారులకు,క్రీడాకారిణిలకు ఈ శుభ సందర్బంగా శుభాకాంక్షలు… శుభాభినందనలు…
ఈ సందర్భాన్ని పురస్కరించుకుని కరీంనగర్ జిల్లా హాకీ అసోసియేషన్ ఆధ్వర్యంలో కరీంనగర్ జిల్లా హాకీ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు బండ శ్రీనివాస్( రాష్ట్ర ఎస్.సి.కార్పోరేషన్ మాజీ చైర్మన్), కరీంనగర్ జిల్లా హాకీ అసోసియేషన్ సహాయ కార్యదర్శి టి.శ్రీనివాస్(హాకీ కోచ్)లను కరీంనగర్ జిల్లా హాకీ అసోసియేషన్ అధ్యక్షులు రవీందర్ సింగ్(కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ మాజీ మేయర్), కార్యదర్శి సురేందర్ సింగ్ లు ఘనంగా సన్మానించడం చాలా సంతోషకరం.

కరీంనగర్ జిల్లా హాకీ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు బండ శ్రీనివాస్( రాష్ట్ర ఎస్.సి.కార్పోరేషన్ మాజీ చైర్మన్)ను సన్మానిస్తున్న

కరీంనగర్ జిల్లా హాకీ అసోసియేషన్ అధ్యక్షులు రవీందర్ సింగ్(కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ మాజీ మేయర్), కార్యదర్శి సురేందర్ సింగ్ లు

Oplus_16908288

కరీంనగర్ జిల్లా హాకీ అసోసియేషన్ సహాయ కార్యదర్శి టి.శ్రీనివాస్(హాకీ కోచ్)ను సన్మానిస్తున్న జిల్లా నాయకులు

జిల్లా హాకీ అసోసియేషన్ నాయకులు

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!