08-11-2025 NORMAL NEWS 10:36 PM
swarnodayam.com
Telugu Daily News
08-11-2025 10:36 PM By Mandala Yadagiri

రిటైర్డ్ డీఎస్పీ రామస్వామి మృతి

రిటైర్డ్ డీఎస్పీ రామస్వామి మృతి
IMG_20251108_223446

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్ (వీణవంక): వీణవంక మండల కేంద్రానికి చెందిన రిటైర్డ్ డిఎస్పి గడ్డం రామస్వామి గౌడ్ (76) అనారోగ్యంతో మృతి చెందాడు. రామస్వామి గౌడ్ మృతితో వీణవంక మండలంలో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి. రామస్వామి గౌడ్ రాష్ట్ర పోలీస్ శాఖలో కానిస్టేబుల్ గా చేరి డిఎస్పి వరకు అంచలంచెలుగా ఎదిగారు. ఎన్డీఏ ప్రభుత్వంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి కేంద్ర మంత్రిగా పనిచేసిన ఎస్ వేణుగోపాలచారి వద్ద కొన్ని రోజులపాటు సీఐ గా విధులు నిర్వహించాడు. రామస్వామి గౌడ్ కు ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ గా, నిజాయితీకి మారుపేరుగా ఉండేవాడని మండల ప్రజలు గుర్తు చేసుకున్నారు. శుక్రవారం వీణవంకలో జరిగిన రామస్వామి గౌడ్ అంత్యక్రియలలో తన బ్యాచ్ మేట్స్, వీణవంక ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

రిటైర్డ్ డీఎస్పీ రామస్వామికి నివాళులు అర్పించిన ఎసై ఆవుల తిరుపతి..

వీణవంక: వీణవంక మండల కేంద్రానికి చెందిన రిటైర్డ్ డీఎస్పీ గడ్డం రామస్వామి అనారోగ్య కారణాలతో తన తుది శ్వాస విడిశారు.ఇట్టి విషయము తెలిసిన వీణవంక పోలీస్ స్టేషన్ ఎసై ఆవుల తిరుపతి గడ్డం రామస్వామి రిటైర్డ్ డీఎస్పీ స్వగృహం కు వెళ్లి ఆయన పార్థివ దేహానికి నివాళులర్పించి, అలాగే వారి కుటుంబ సభ్యులకి సంతాపం తెలిపారు.

రిటైర్డ్ డీఎస్పీ రామస్వామికి నివాళులు అర్పిస్తున్న ఎసై ఆవుల తిరుపతి..

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!