Social 1080×1350 • Multi-page
08-11-2025 BREAKING NEWS 11:15 PM
swarnodayam.com
Telugu Daily News

తెల్లవారే సరికి రోడ్డు మీద నాటు కోళ్ల ప్రత్యక్షం… కోళ్ల కోసం ఎగబడ్డ జనం.. ఊరంతా నాటు కోళ్ల మయం

తెల్లవారే సరికి రోడ్డు మీద నాటు కోళ్ల ప్రత్యక్షం… కోళ్ల కోసం ఎగబడ్డ జనం.. ఊరంతా నాటు కోళ్ల మయం
Oplus_16908288

స్వర్ణోదయం ప్రతినిధి, హనుమకొండ: హనుమకొండ జిల్లా ఎల్కతుర్తిలో ఆసక్తికరమైన ఘటన చోటు చేసుకుంది. శనివారం తెల్లవారు జామున ఎల్కతుర్తి- సిద్దిపేట జాతీయ రహదారి వెంబడి పంట పొలాల్లో గుర్తు తెలియని వ్యక్తులు సుమారు రెండు వేల నాటు కోళ్లను వదిలేశారు. విషయం తెలిసిన వెంటనే స్థానికులు అక్కడికి చేరుకుని పొలాలు, పత్తి చేనుల్లో వదిలిన నాటుకోళ్లను పట్టుకోవడం కోసం ఎగబడ్డారు. వెంటబడి దొరికిన కాడికి దొరకబట్టుకుని వెళ్ళి చికెన్(Chiken) విందు చేసుకుంటున్నారు. ఇంత పెద్ద ఎత్తున నాటు కోళ్లను ఎవరు, ఎందుకు వదిలిపెట్టారో తెలియాల్సి ఉంది. ఏదేమైనా స్థానికులకు మాత్రం ఈ రోజు పెద్ద పండుగే అయింది. స్థానికులు కోళ్ల కోసం ఎగబడడంతో మా పంట పొలాలు పాడై పోయాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

విచారణ చేపట్టిన పోలీసులు..

కోళ్ళు వదిలి వెళ్ళింది ఎవరు అనే విషయంపై పోలీసులు(Police) విచారణ చేపట్టారు. ప్రమాదవశాత్తు పడిపోయాయా..? ఎవరైన తీసుకువచ్చి వదిలేశారా..? అనే కోణంలో సీసీ(CC) పుజేజ్ ఆధారంగా విచారణ కొనసాగిస్తున్నామని పోలీసులు పేర్కొన్నారు.

కోళ్ల ఆరోగ్య పరిస్థితిపై విచారణ..
కోళ్లు వదిలిపోయిన ఘటనపై అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. కోళ్ల(Hen) ఆరోగ్య పరిస్థితి(Health condition)పై పలు విధాల చర్చ సాగుతుంది. కోళ్లకు ఏమైనా వైరస్(Virus) ఉందా లేకుంటే రోగం ఉందా అనే అనుమానంతో కొన్ని కోళ్ల నుంచి నమూనాలు సేకరించి పరీక్షల కోసం పంపించినట్లు పశు వైద్య అధికారులు తెలిపారు. పరీక్షల ఫలితాలు వచ్చే వరకు ఆ కోళ్ళు తినవద్దని అధికారులు పేర్కొన్నారు.

Oplus_16908288
Oplus_16908288
Oplus_16908288

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!