Social 1080×1350 • Multi-page
10-11-2025 BREAKING NEWS 03:30 PM
swarnodayam.com
Telugu Daily News

ప్రముఖ కవి డాక్టర్ అందెశ్రీ మరణం పట్ల తీవ్ర సంతాపం. – రైతు ప్రజాసంఘాల సమాఖ్య జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు.

ప్రముఖ కవి డాక్టర్ అందెశ్రీ మరణం పట్ల తీవ్ర సంతాపం. – రైతు ప్రజాసంఘాల సమాఖ్య జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు.
IMG_20251110_152443

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి కరీంనగర్: తెలంగాణ రాష్ట్ర సాధన కోసం సాగిన సాంస్కృతిక ఉద్యమంలో కవిగా తన పాటలతో, సాహిత్యంతో కీలక పాత్ర పోషించిన తెలంగాణ రాష్ట్ర గీతం జయ జయ హే తెలంగాణ సృష్టికర్త అందెశ్రీ మరణం తెలంగాణకు తీరని లోటని, యావత్ తెలంగాణ ప్రజానీకానికి తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందని రైతు ప్రజా సంఘాల సమాఖ్య జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం కరీంనగర్ లో ప్రజా సంఘాల సమాఖ్య నాయకులతో నిర్వహించిన అందెశ్రీ సంతాప కార్యక్రమంలో పోలాడి రామారావు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమ కాలంలో అందెశ్రీ రాసిన జయ జయ హే తెలంగాణ గీతంతో ఒళ్ళు పులకరించి ఉద్యమానికి ఉత్సాహం నింపేదన్నారు.
ప్రముఖ కవి డాక్టర్ అందెశ్రీ తెలంగాణ ఉద్యమ భావజాలాన్ని జయ జయ హే తెలంగాణ గేయ రూపంలో రచించిన గీతం యావత్ తెలంగాణ ప్రజల్లో చిరస్థాయిగా ఉంటుందని నివాళులు అర్పిస్తూ అందెశ్రీ పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతున్ని ప్రార్థిస్తూ దుఃఖ సాగరంలో ఉన్న వారి కుటుంబ సభ్యులకు ప్రజా సంఘాల తరపున, నా తరపున ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నట్లు పోలాడి రామారావు ప్రకటించారు.

అందెశ్రీ (ఫైల్)

మాట్లాడుతున్న రైతు ప్రజా సంఘాల సమాఖ్య జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!