Social 1080×1350 • Multi-page
10-11-2025 BREAKING NEWS 07:59 PM
swarnodayam.com
Telugu Daily News

రేపు ధ్యాన విద్యార్థి మహా యజ్ఞం

రేపు ధ్యాన విద్యార్థి మహా యజ్ఞం
Oplus_16908288

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్:
ఈనెల 11వ తేదీ మంగళవారం హుజురాబాద్ పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల మైదానంలో పిరమిడ్ ధ్యానం వ్యవస్థాపకులు బ్రహ్మర్షి పితామహా పత్రీజీ జన్మదినం సందర్బంగా ధ్యాన విద్యార్థి మహా యజ్ఞం కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు పిరమిడ్ యోగ గురువు చింత అనిల్ కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…విద్యార్థులు తమ తమ చదువులో ముందడుగు వేయాలంటే ఏకాగ్రత అవసరమని, ధ్యానం ద్వారా అది సాధ్యమవుతుందన్నారు. ఈ కార్యక్రమం ఉదయం 10 నుండి 12 గంటల వరకు జరుగుతుందని అన్నారు. ధ్యానం వల్ల విద్యార్థులకు కలిగే లాభాలపై డాక్టర్ వేదాంతం శ్రీదేవి వివరిస్తారని, ఇందులో పాల్గొని వివిధ పాఠశాలల విద్యార్థులకు అన్ని సౌకర్యాలు కల్పించినట్టు ఆయన చెప్పారు.

రేపు హుజురాబాద్లో ధ్యాన విద్యార్థి మహా యజ్ఞం

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!